విద్యార్థుల పక్షాన పోరాటం చేస్తాం..

తెలంగాణ యూనివర్సిటీకి చేరుకున్న తెలంగాణ స్టూడెంట్స్ పొలిటికల్ జాక్ బృందం..
నవతెలంగాణ -డిచ్ పల్లి: తెలంగాణ రాష్ట్రంలోని విద్యార్థి నిరుద్యోగ యువత ఉజ్వల భవిష్యతే లక్ష్యంగా ఏర్పడిన తెలంగాణ స్టూడెంట్స్ పొలిటికల్ జాక్ క్షేత్ర సాయి పర్యటన లో భాగంగా ఉత్తర తెలంగాణలో ఉన్న కాకతీయ యూనివర్సిటీ, శాతవాహన యూనివర్సిటీ  పర్యటన ముగించుకొని మూడవరోజు శుక్రవారం  తెలంగాణ యూనివర్సిటీ కి చేరుకున్నారు .యూనివర్సిటీలో ఉన్న స్కాలర్స్  విద్యార్థులతో మధ్యాహ్నం భోజనం విరామ సమయంలో  వారితో వివిధ అంశాలపైన చర్చించి వారి ఆలోచనలు తెలుసుకున్నారు. జరిగింది.  TSP-JAC తెలంగాణా స్టేట్ చైర్మన్ మాట్లాడుతూ తెలంగాణ పేరు మీద ఉన్న యూనివర్సిటీలో సమస్యలను అడిగి తెలుసుకున్నారు. రాబోయే ఎన్నికల్లో యూనివర్సిటీ విద్యార్థులు ఎన్నికల్లో భాగస్వామ్యం కావాలని, ఓటు ప్రాధాన్యతను ప్రతి గ్రామానికి చేరవేయలని సూచించారు. ఈ ఎన్నికల్లో తెలంగాణ స్టూడెంట్స్ పొలిటికల్ జేఏసీ విద్యార్థుల నిరుద్యోగుల యువత పక్షానకీలక పాత్ర  వహిస్తుందని తెలిపారు.టిఎస్ పి -జేఏసీ రాష్ట్ర అధ్యక్షులు వలిగొండ నరసింహం  మాట్లాడుతూ ఇక్కడ చర్చించిన ప్రతి అంశాన్ని అన్ని రాజకీయ పార్టీలు తమ మేనిఫెస్టోలో పెట్టి అమలు ఐయ్యేంత వరకు విద్యార్థుల పక్షాన ఉస్మానియా యూనివర్సిటీలో పెద్ద అన్న లాగా ఉంటామని విద్యార్థులకు భరోసా ఇచ్చారు. యూనివర్సిటీ విద్యార్థి నాయకుడు అనిల్ మాట్లాడుతూ ముఖ్యంగా ఉన్నత విద్యపైన అభిప్రాయాలను వారి సమస్యలు, రక్షణ కు సంబందించిన అంశాలను లేవనేత్తారన్నారు. టిఎస్ పి -జేఏసీ స్టేట్ జనరల్ సెక్రెటరీ బోడ వంశి నాయక్  తెలంగాణ యూనివర్సిటీ విద్యార్థులు చర్చను సమన్వయం చేస్తూ ప్రతి విద్యార్థి ప్రజాస్వామ్యం, ప్రజల శక్తి ని రాజకీయ లో అవినీతికి తావులేని ప్రభుత్వల ఏర్పాటులో యూనివర్సిటీ విద్యార్థులే కీలక మన్నారు. వీరితో పాటు ఈ చర్చలో తెలంగాణ యూనివర్సిటీ లోని యూనివర్సిటీ జేఏసీ చైర్మన్లు, వివిధ సంఘాల విద్యార్థి నేతలు ఎ.సాయివర్మ, సాయి కుమార్, నందు, మునిగంటి సంజయ్, రీసర్చ్ స్కాలర్స్, విద్యార్థులు పాల్గొన్నారు.
Spread the love