కనీస వేతనాలు ఇచ్చేదాకా పోరాడుతాం

జీవో నెంబర్‌ 60 అమలు చేయాలి
ఏఐటీయూసీ రాష్ట్ర ఉప ప్రధాన కార్యదర్శి
ఎం.నరసింహ, యూనియన్‌ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి రామా రాజేష్‌ ఖన్నా డిమాండ్‌
నవతెలంగాణ-సుల్తాన్‌బజార్‌
నేషనల్‌ హెల్త్‌ మిషన్‌ స్కీమ్‌లో గత అనేక సంవ త్స రాలుగా పనిచేస్తున్న అకౌంటెంట్లను, అధికారులు కార్మికుల్ని శ్రమ దోపిడీకి గురి చేస్తున్నారని ఏఐటీయూసీ రాష్ట్ర ఉప ప్రధాన కార్యదర్శి ఎన్‌ హెచ్‌ ఎం కాంట్రాక్ట్‌ అండ్‌ ఔట్‌ సోర్సింగ్‌ వర్కర్స్‌ యూనియన్‌ రాష్ట్ర అధ్యక్షులు ఎం.నర సింహ విమర్శించారు. నేడు కమిషనర్‌ కార్యాలయం ముం దు నేషనల్‌ హెల్త్‌ మిషన్‌ స్కీంలో పనిచేస్తున్న పీఎచ్‌.సి.డీ. ఈ.ఓ, యూ.పీ.హెచ్‌.సి. సి.ఓ./ పీ.హెచ్‌.ఎం.లు అకౌంటె ంట్స్‌, బ్లాక్‌ లెవెల్‌ అకౌంటెంట్‌, అర్‌.కే.ఎస్‌.కే కౌన్సిలర్స్‌, ఎన్‌.సి.డీ.కౌన్సిలర్స్‌ ఉద్యోగుల సమస్యలను ప్రభుత్వం వెం టనే పరిష్కరించాలని 60 జి.ఓ. ప్రకారం రూ.22, 750/- ఇవ్వాలని ధర్నా నిర్వహించారు. ఈ సందర్బగా ఎం.నర్సి ంహా మాట్లాడుతూ నేషనల్‌ హెల్త్‌ మిషన్‌ ఉద్యో గులు ఎదుర్కొంటున్న సమస్యలను పరిష్కరించాలని కో రుతూ తెలంగాణవైద్య ఆరోగ్యశాఖ కమిషనర్‌ కార్యాలయం ఎదుట వన్‌ డే స్ట్రైక్‌ కార్యక్రమాన్ని మంగళవారం నిర్వహిం చారు. ప్రభుత్వం వెంటనే నేషనల్‌ హెల్త్‌ మిషన్‌ ఉద్యోగుల సమస్యలను పరిష్కరించడంతోపాటు డిమాండ్లను వెంటనే నెరవేర్చాలని ఆయన ఈ సందర్భంగా ప్రభుత్వాన్ని డిమాం డ్‌ చేసారు. నేషనల్‌ హెల్త్‌ మిషన్‌ స్కీములో పారామెడికల్‌ నాన్‌ పారామెడికల్‌ అని విభజించి పారామెడికల్‌ సిబ్బందికి మాత్రం జీతాలు పెంచుతూ నాన్‌ పారామెడికల్‌ సిబ్బందికి జీతాలు పెంచకుండా కనీస వేతనాలను సైతం అమలు చేయడం లేదన్నారు. రాష్ట్ర ప్రభుత్వం అధికారులు ఈ సమ స్యలపై తగు చర్యలు తీసుకుని కార్మికులకు న్యాయం చేయ నితో భవిష్యత్తులో పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమాలు నిర్వహించనున్నట్లు వారు వివరించారు. సమన పనికి సమ న వేతనం అమలు చేయాలనీ చెప్పారు.ఈ కార్యక్రమంలో బాలసుబ్రమణ్యం, రవి కుమార్‌, స్వప్న, సందీప్‌ , సునీల్‌ , జీవన్‌, శ్రీమణి, కావ్య , లావణ్య , వరలక్ష్మి , పుష్ప ఓ.సందీప్‌ కుమార్‌ లోకేష్‌ , నర్సిములు , పావని , మురళి కష్ణ , సిద్దు కుమార్‌ , ప్రేమ్‌ సాగర్‌, తదితరులు పాల్గొన్నారు.

Spread the love