
నవతెలంగాణ-ఆర్మూర్ : ఓటర్లు ఆలోచించి అవినీతి కి పాల్పడిన పార్టీలకు కాకుండా అవినీతి లేకుండా పాలించే కమలం పార్టీకి ఓటు వేయాలి అని
బిజెపి అధికారంలో రాగానే ధరణి ముందుగా తొలగిస్తాం అని జిల్లా పార్లమెంట్ సభ్యులు ధర్మపురి అరవింద్ అన్నారు. పట్టణంలోని క్షత్రియ కళ్యాణ మండపంలో సోమవారం జరిగిన సమావేశంలో మాట్లాడుతూ పసుపు బోర్డు తీసుకుని వచ్చామ నీ,, పసుపు ధర 20వేల నుంచి 25 వేల వరకు పెరిగిన ఆశ్చర్యం లేదు ,ప్రపంచంలో పసుపు క చాలా డిమాండ్ ఉంది అని అన్నారు. బిజెపి ద్వారానే చెరుకు ఫ్యాక్టరీ సైతం తీసుకొని వస్తా యూపీలో కర్ణాటకలో మూతబడిన చెరుకు బాక్టీలను ఏ విధంగా తెరిపించాము అని అన్నారు. స్థానిక ఎమ్మెల్యే ఆర్టీసీ 9 కోట్లు స్టేట్ కార్పొరేషన్ 20 కోట్లు బకాయిలు ఉన్నారన్నారు .బిజెపి అధికారం రాగానే వడ్డీతో సహా వసూలు చేస్తామన్నారు. జిల్లాలోని ఏడు నియోజకవర్గాల్లో టిఆర్ఎస్ బిజెపికి పోటీ ఉందని కాంగ్రెస్ మూడో స్థానంలో ఉందన్నారు. కచ్చితంగా బిజెపి ఏడు నియోజకవర్గాల్లో విజయం సాధించుకుంటామని ఆయన ధీమా వ్యక్తం చేశారు. పార్టీ టికెట్ ఎవరికీ ఇచ్చిన అందరు కలిసి పార్టీని గెలిపించుకోవాలని ఆయన కోరారు మళ్లీ టిఆర్ఎస్ ఎమ్మెల్యేలు గెలిపిస్తే భూ కబ్జాలు బుట్టలు మాయం అవినీతి రౌడీ జానికి పోషించినట్లే అని ఆయన అన్నారు దళారి వ్యవస్థను పూర్తిగా తొలగిస్తుంది అని అన్నారు. ఈ కార్యక్రమంలో బి జె పి జిల్లా అధ్యక్షులు బస్వా లక్ష్మీ నరసయ్య, పెద్దొల్ల గంగారెడ్డి ,,పైడి రాకేష్ రెడ్డి, విజయభారతి, పాలెపు రాజు, జెస్సు అనిల్ కుమార్ ,కౌన్సిలర్లు తదితరులు పాల్గొన్నారు.