సంక్షేమ ప్రభుత్వం.. సన్న బియ్యం పథకం 

Welfare government.. Sanna rice scheme– ఉదయం నుంచి లబ్ధిదారులు బారులు
– ఇది నిరుపేదల ఆత్మగౌరవ పథకం 
– ప్రారంభించిన మంత్రి సీతక్క
నవతెలంగాణ – తాడ్వాయి 
ప్రతి పేద కుటుంబం సన్నబియ్యం తినాలనే సంకల్పంతో తెలంగాణ రాష్ట్ర ప్రజా ప్రభుత్వం ప్రవేశపెట్టిన సన్న బియ్యం పంపిణీ కార్యక్రమాన్ని బుధవారం మండల కేంద్రంలో మంత్రి సీతక్క ములుగు జిల్లా కలెక్టర్ దివాకర టిఎస్, ఎస్పీ శబరిస్ మిగతా అధికారులతో కలిసి ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి సీతక్క మాట్లాడుతూ.. గత బిఆర్ఎస్ ప్రభుత్వంలో దొడ్డు బియ్యం తినలేక, సన్న బియ్యం కొనలేక, పేద ప్రజలు పలు రకాల ఇబ్బందులు పడ్డారని దీంతో దొడ్డు బియ్యం పక్కదారి పట్టాయని ఆరోపించారు. నాణ్యమైన సన్నబియ్యాన్ని తెల్ల రేషన్ కార్డు కలిగిన ప్రతి ఒక్కరికి 6 కిలోల చొప్పున అందిస్తున్నామని, రానున్న రోజుల్లో అర్హులందరికీ రేషన్కారులు అందజేసి సన్నబియాన్ని అందించడమే ప్రభుత్వ ధ్యేయమని తెలిపారు. రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సారాధ్యంలో ప్రజానికం ఆనందంగా ఉన్నారని హర్షం వ్యక్తం చేశారు. నిరుద్యోగ ఉపాధి కోసం రాజీవ్ యువ వికాస పథకానికి అరులైన వారు ఈనెల 14వ తేదీ వరకు ఆన్లైన్లో దరఖాస్తు చేసుకొని ప్రభుత్వ అందించే సుమారు నాలుగు లక్షల సబ్సిడీ రుణాలను ఆయా యూనిట్ల పేరుట సద్విని చేసుకోవాలని తెలిపారు. అనంతరం కళ్యాణ లక్ష్మి, షాది ముబారక్ రూ. 26,03,016 విలువచేసే 26 చెక్కులను పంపిణీ చేశారు. కళ్యాణ లక్ష్మి చెక్కులను ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. ప్రజా సంక్షేమమే ప్రజా పాలన, ప్రజా ప్రభుత్వ ధ్యేయమని ఆమె అన్నారు. ఈ కార్యక్రమంలో వివిధ శాఖల అధికారులు, స్థానిక ఎమ్మార్వో సురేష్ బాబు, మండల అభివృద్ధి అధికారి సుమనవాని, జిల్లా గ్రంధాలయ చైర్మన్ బానోతు రవిచందర్, ప్రత్యేక అధికారి రాంపతి, కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులు బొల్లు దేవేందర్, తాడ్వాయి మాజీ సర్పంచ్ ఇరుప సునీల్ దొర, బెజ్జూరి శీను, ముజాఫర్, కాంగ్రెస్ పార్టీ నాయకులు ప్రజాప్రతినిధులు, ప్రజలు తదితరులు పాల్గొన్నారు.
Spread the love