నవతెలంగాణ- తిరుమలగిరి
ఆరు దశాబ్దాల కాలంలో జరగని అభివృద్ధి కేవలం 9 ఏళ్లలోనే చేసి చూపించి మునుపెన్నడు లేని విధంగా సంక్షేమ పథకాలు తీసుకొచ్చి తుంగతుర్తి నియోజకవర్గాన్ని సస్యశ్యామలం చేసిన గాదరినే మళ్లీ గెలిపిస్తాయని తిరుమలగిరి మున్సిపాలిటీ మాలిపురం గ్రామ శాఖ యువ నాయకులు పోతరాజు అజయ్ కుమార్ అన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కక్షలు హత్య రాజకీయాలతో అభివృద్ధికి ఆమడ దూరంలో ఉన్న తుంగతుర్తి నియోజకవర్గాన్ని 9 ఏళ్లలో ఊహించని అభివృద్ధి చేసి చూపించారన్నారు. ఆధునిక పరిజ్ఞానం, నేటితరం, యువతరం అనుగుణంగా పరిపాలన సాగిస్తూ ముందుకు సాగుతూ తుంగతుర్తి నియోజకవర్గం రూపురేఖలు మార్చారన్నారు. అనునిత్యం ప్రజల మధ్య ఉంటూ ప్రజా సంక్షేమాన్ని ఒకపక్క, ప్రభుత్వం నుంచి వచ్చే సంక్షేమ పథకాలు మరోపక్క అమలు చేస్తూ ఒక తిరుగులేని యువనేతగా ఎదిగారన్నారు. తుంగతుర్తి మరోమారు ఇంకా మరిన్ని సంక్షేమ పథకాలతో ప్రగతి పథంలో ముందుకు సాగాలంటే అది గాదరి సారధ్యంలోనే జరుగుతుందని మూడోసారి ప్రజలు ఆశీర్వదించి భారీ మెజారిటీతో గెలిపించాలని కోరారు.