చంద్రబాబు అరెస్ట్‌పై స్పందించిన పశ్చిమ బెంగాల్ సీఎం

నవతెలంగాణ – బెంగాల్: ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు అరెస్ట్‌పై పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ స్పందించారు. సోమవారం ఆమె మీడియాతో మాట్లాడుతూ… చంద్రబాబు అరెస్ట్ కక్ష సాధింపులా ఉందన్నారు. చంద్రబాబును అరెస్ట్ చేసిన తీరు సరికాదన్నారు. టీడీపీ హయాంలో ఏదైనా తప్పు జరిగితే మాట్లాడాలని, పూర్తిస్థాయిలో విచారణ జరిపించాలన్నారు. కానీ కక్షపూరితంగా ప్రవర్తించడం సరికాదన్నారు.

Spread the love