రాజ్ తరుణ్, అమత చౌదరి హీరో హీరోయిన్‌గా, శ్రీనివాస్ అవసరాల, ధన్య బాలకృష్ణ ముఖ్య పాత్రల్లో నటిస్తున్న చిత్రం ‘టార్టాయిస్’. ఎస్ కె గోల్డెన్ ఆర్ట్స్, ప్రశ్విత ఎంటర్టై న్మెంట్, ఎన్ వి ఎల్ క్రియేషన్స్, మధుపాల మహా మూవీస్ పతాకం పై రిత్విక్ కుమార్ దర్శకత్వంలో విజరు చౌదరి, శశిధర్ నల్ల, రామిశెట్టి రాంబాబు, మధుపాల సురేష్ నిర్మిస్తున్నారు.ఈ సినిమా షూటింగ్ పూర్తి చేసుకుని ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనుల్లో బిజీగా ఉంది. ఈ సందర్భంగా యూనిట్ సభ్యులు మాట్లాడుతూ, ‘మా చిత్రం చాలా కొత్తగా ఉంటుంది. చాలా డిఫరెంట్ కథ. రాజ్ తరుణ్ 25వ చిత్రంగా తన కెరీర్‌లో బెస్ట్ సినిమా అవుతుంది. శ్రీనివాస్ అవసరాల, ధన్య బాలకష్ణ, హీరోయిన్ అమత చౌదరి క్యారెక్టర్స్ చాలా బలంగా ఉంటాయి. కొత్త స్క్రీన్ ప్లేతో రూపొందుతున్న మంచి థ్రిల్లర్ చిత్రమిది. హీరోకి నిద్రలో నడిచే అలవాటు ఉంది. ఈ క్రమంలో తను ఒక అమ్మాయిని చంపేస్తాడు. తర్వాత ఏం జరుగుతుందనే కాన్సెప్ట్‌తో దీన్ని తెరకెక్కించారు. త్వరలోనే రిలీజ్ చేస్తాం’ అని తెలిపారు ఈ చిత్రానికి సంగీతం: అనూప్ రూబెన్స్, సినిమాటోగ్రఫీ : శబరి, ఎడిటర్ : గుళ్ళపల్లి మాధవ్ కుమార్, ఆర్ట్ : దేవర మధుకర్, కథ – దర్శకత్వం : రిత్విక్ కుమార్, నిర్మాతలు :విజయ్ చౌదరి, శశిధర్ నల్ల, రామిశెట్టి రాంబాబు మధుపాల సురేష్.



