Thursday, June 11, 2026
E-PAPER
Homeనేటి వ్యాసంఎంతటి ‘‘ఘనులు’’ మనవారు!?

ఎంతటి ‘‘ఘనులు’’ మనవారు!?

- Advertisement -

మన ప్రథమ ప్రధాని జవహర్‌ లాల్‌ నెహ్రూ తనను ‘ప్రథమ సేవకుడు’గా ప్రకటించుకున్నారు. పెట్టుబడిదారి పార్టీ ప్రధాన మంత్రులలో బహుశా నెహ్రూప్రథమ సేవకునిగా నిరూపించుకున్నారు. ‘‘మన’’ విశ్వగురు ప్రధాని, మొదటి నుండి నెహ్రూను అధిగమించాలను కున్నారు. తనను ‘‘నరు’’గా ప్రతిబింబించు కున్నారు. ఆయన కూడా తనను ప్రధాన సేవకుడుగా అభివర్ణించుకున్నారు. అయితే సామాన్యుల సేవకునిగా కాక కార్పొరేట్‌ సంస్థల యాజమానులలో కొందరి ‘ప్రధాన సేవకుడు’గా ప్రపంచ ప్రఖ్యాతి పొందారు. ఈయన ప్రధాని అయిన తొలినాళ్లలో ‘‘నరు’’ శీర్షికతో ఒక లఘు దృశ్యచిత్రం ప్రధాని కార్యాలయం నుండి విడుదల అయింది. అందులో నరు గారి అనేక చిత్రవిచిత్ర విన్యాసాలు ఉన్నాయి. బాల్యంలో మొసళ్లతో ఆడుకోవడం, (ఆయన ఆడానని చెప్పిన మొసళ్ల చెరువు లేనేలేదని తేలింది.) బాల్యంలో చాయ్ అమ్మడం, (ఆయన చాయ్ అమ్మానని చెప్పిన రైల్వే స్టేషనే ఆ రోజుల్లో లేదు) 2013లో చార్ధామ్‌లో సంభవించిన పెను ఉప్పెన నుండి రాత్రికి రాత్రి, గుజరాత్‌ ముఖ్యమంత్రిగా కాక బీజేపీ ప్రతిపాదిత ప్రధాని అభ్యర్థిగా, అక్కడకు పోయి భక్తులను హెచ్చరించి, రక్షించి తిరిగి గాంధీనగర్‌కు తిరిగిరావడం వంటి ధైర్యసాహస మహిమాన్విత ఘటనల దృశ్య చిత్రీకరణలు ఉన్నాయి.

(క్రితంలో పుట్టపర్తి సాయి కూడా తన కొత్త మందిరం కూలే ముందే భక్తులను హెచ్చరించి రక్షించారని సత్ప్రచారం చేయించారు. అదృశ్యశక్తులు తప్ప ఎవరూ వీరి విన్యాసాలను తిలకించలేదు.) నాటి దేశఉపాధ్యక్షుడు వెంకయ్యతో సహా రాజ్యాంగ పదవులలో ఉన్న ప్రముఖులంతా తమ అధికార గృహాలలో సావకాశంగా ఈ దృశ్యచిత్రాన్ని తిలకించి పులకించారు. నరును మెచ్చు కున్నారు. తమ విలువయిన సమయాన్ని బహుబాగుగా సదుపయోగపరిచిన ‘‘ఘనులు’’వీరు. మన ప్రధాన సేవకున్ని ఆయన సందర్శించిన దేశాలలో ఆయా దేశాల అత్యుత్తమ పౌరగౌరవ పతకాలతో అలరించారు. ఇజ్రాయిల్‌ లాంటి ఆయన పితృ దేశం తన పుత్ర ప్రధానిని‘స్పీకర్‌ ఆఫ్‌ ది నెసెట్‌ (పార్లమెంటు) మెడల్‌’ తో ఆదరించడం ఆశ్చర్యం కాదు. తనకు31 వ, 32 వ ప్రపంచ గుర్తింపులుగా స్కాండినేవియన్‌ దేశాలయిన నార్వే, స్వీడెన్‌ లు కొద్దిరోజల కిందట తమ దేశాల అత్యుత్తమ పురస్కారాలతో సన్మానించడం ఆలోచించ వలసిన విషయం. నరు అందించిన అంతర్జా తీయ సంబంధాల, దౌత్య అపూర్వ సేవలకు గుర్తింపుగా నార్వే ‘గ్రాండ్‌ క్రాస్‌ ఆఫ్‌ ది రాయల్‌ నార్వేజి యన్‌ ఆర్డర్‌ ఆఫ్‌ మెరిట్‌’ను బహూ కరించింది.

ఇండియా – స్వీడెన్‌ సమబంధాలలో నరు నాయకత్వ సహకారానికి గుర్తింపుగా స్వీడెన్‌ ‘రాయల్‌ ఆర్డర్‌ ఆఫ్‌ ది పోలార్‌ స్టార్‌, డిగ్రీ కమాండర్‌ గ్రాండ్‌ క్రాస్‌’ను ప్రదానం చేసింది. ఈ రెండు దేశాలు నరు దార్శనిక నాయకత్వాన్ని, వాణిజ్యం, సాంకేతికత, పరిశుద్ధ ఇంధనం వ్యవహారాలలో ద్వైపాక్షిక, వ్యూహాత్మక భాగస్వా మ్యాన్ని సంబరించాయి. నార్వే పత్రకారిణియ హెలె లింగ్‌, ‘‘ప్రైమ్‌ మినిస్టర్‌ మోడీ, ప్రపంచ ప్రఖ్యాత పత్రికా స్వేచ్ఛా దేశ పాత్రికేయుల కొన్ని ప్రశ్నలకు జవాబు చెప్పండి’’ అని విన్నవించారు. నరు విన్నారు. కానీ ఆగకుండా వెళ్లారు. ‘‘ప్రైమ్‌ మినిస్టర్‌ మోడీ నా ప్రశ్నకు జవాబు చెప్పలేదు. పత్రికా స్వేచ్ఛలో మా దేశం మొదటి స్థానంలో ఉంది.(అందుకే) ఇండియా 157 వస్థానంలోకి దిగజారింది’’అని ఆమె బాధపడ్డారు. ప్రజాస్వామ్యానికి, ప్రజాసంక్షేమానికి, మానవత్వ పరిపాలనకు పేరుగన్న దేశాలు కూడా నరును సత్కరించడం సంభ్రమమే.గ్రాండ్‌ క్రాస్‌ ఆఫ్‌ ది రాయల్‌ నార్వేజియన్‌ ఆర్డర్‌ ఆఫ్‌ మెరిట్‌ ను 1985లో నార్వే రాజు ఐదవ ఓలివ్‌ స్థాపించారు.

నార్వే సంబంధిత అంశాలు, మానవత్వ విషయాలలో అత్యుత్తమ సేవలు అందించిన దేశవిదేశీయులకు ఈ పురస్కారాన్ని ఇస్తారు. ఇందులో ఒక బ్యాడ్జి (చిహ్నం) తప్ప ఇతర నగదు, పాదార్థిక ప్రయోజనాలు ఉండవు. నార్వేప్రజలకు గాని, స్వదేశంతో సహా ఇతర దేశాల ప్రజలకు గాని నరు ఎలాంటి మానవత్వ సేవలు అందించారో! ఈ పురస్కారం పొందడానికి ఎవరయినా నార్వే రాజుకు దరఖాస్తు చేసుకోవచ్చు. ఈ పురస్కార ప్రదానం చేయవచ్చని రాచ కార్యాలయం రాజు కు సిఫార్సు చేస్తుంది. సాధారణంగా రాచ కార్యాలయం ఏ దరఖాస్తునూ తిరస్కరించదు. గ్రహీత పదోన్నతి పొందినా, కాలంచేసినా ఆ పురస్కారాన్ని వాపసు చేయాలి. స్వీడెన్‌ రాయల్‌ ఆర్డర్‌ ఆఫ్‌ ది పోలార్‌ స్టార్‌, డిగ్రీ కమాండర్‌ గ్రాండ్‌ క్రాస్‌ను స్వీడెన్‌ రాజు మొదటి ఫ్రెడెరిక్‌ 1748 ఫిబ్రవరి 23 న స్థాపించారు. దీనికోసం దేశవిదేశీయులతో పాటు రాజ్య రహితులు (విదేశాల నుండి అనేక కారణాలతో స్వీడెన్‌ కు వలసవచ్చి, తమ దేశ పౌరసత్వం కోల్పోయి, ఏ దేశ పౌరసత్వవం లేనివారు. ఇక్కడ స్వీడెన్‌ విశాల మానవత్వ దక్పథం మెచ్చుకోదగ్గది.) కూడా ఈ పురస్కారానికి దరఖాస్తు చేసుకోవచ్చు.

పురస్కార మండలి దీన్ని రాజుకు సిఫారసు చేస్తుంది. ప్రభు త్వం ఆమోదిస్తుంది. ఆపై రాజు ఈ పురస్కార ప్రదానం చేస్తారు. (మన నరుకు స్వీడెన్‌ రాకుమారి విక్టోరియా ఈ పురస్కారాన్ని అందించారు) ఇందులో కూడా ఒకబ్యాడ్జి (చిహ్నం) ఉంటుంది. ఎలాంటి నగదు, భూభౌతిక పాదార్థిక ప్రయోజనాలు ఉండవు. గతంలో సోషలిస్టులను, కమ్యూనిస్టు నాయకులను పీడిత పేద ప్రజల పట్ల వారి ప్రేమ, సంఘనిర్మాణ దక్షత, సిద్ధాంత విప్లవ నిబద్దత, సామాజిక బాధ్యతల నిర్వహణల ప్రాతిప్రదికల ఆధారంగా గౌరవించేవారు. ఆ గౌరవ పురస్కారాలకు అధికస్థాయి విశ్వవ్యాపిత విలువ ఉండేది. నేడు సాధా రణంగా ఒక దేశం మరొక దేశ నాయకునికి ఇచ్చే పురస్కారాలు ఇరు దేశాల మధ్య సద్భావన, సౌజన్య, దౌత్య సంబంధాలను మెరుగు పరుచు కోవడానికి, ఆదరాభిమానాల నిర్వహణకు, వాణిజ్య వ్యవహారాల పెంపునకు ఉద్దేశించబడి ఉంటాయి.

సంగిరెడ్డి హనుమంత రెడ్డి, 949020 4545

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -