Tuesday, April 28, 2026
E-PAPER
Homeతెలంగాణ రౌండప్కొత్త "ఆసరా" ఎప్పుడో.?

కొత్త “ఆసరా” ఎప్పుడో.?

- Advertisement -

చివరిసారిగా 2022లో మంజూరు
ఏళ్లుగా ఎదురుచూస్తున్న దరఖాస్తుదారులు
నవతెలంగాణ – మల్హర్ రావు

ఆసరా కొత్త పింఛన్ల కోసం అర్హులైన దరఖాస్తుదారులు ఏళ్ల తరబడిగా ఎదురుచూస్తున్నారు. గత బీఆర్ఎస్ ప్రభు త్వంలో దరఖాస్తు చేసుకున్న వారితో పాటు, కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తర్వాత దరఖాస్తు చేసుకున్నవారు మండలంలో వేలల్లో ఉన్నారు. ఆసరా పింఛన్ల కోసం నిత్యం వృద్ధులు, వితంతువులు, దివ్యాంగులు ప్రభుత్వ కార్యాలయాల చుట్టూ తిరుగుతున్నారు. గత బీఆర్ఎస్ ప్రభుత్వం రెండోసారి అధికారంలో రాగానే ఆసరా పింఛన్లు పొందేందుకు అర్హత వయసును 65 నుంచి 57 ఏళ్లకు తగ్గించింది. మీ సేవ సెంటర్లలో దరఖాస్తులు చేసుకోవాలని తెలిపింది. దీంతో ప్రభుత్వ సూచనల మేరకు గ్రామాల్లో దరఖాస్తుదారులు వందల్లో వచ్చాయి. మండలంలో  మొత్తం రెండు వెల మంది కొత్త పింఛన్ కోసం దరఖాస్తు చేసుకుని నిత్యం కార్యాలయాల చుట్టూ తిరుగుతున్నారు.

ప్రభుత్వం 99 రోజుల పాటు నిర్వహించిన ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక కార్యక్రమంలో భాగంగా ఇటీవల గ్రామసభలు నిర్వహించారు. ఈ సభల్లో ప్రభుత్వం అమలు చేస్తున్న వివిధ సంక్షేమ పథకాల ద్వారా లబ్ధి పొందిన వారి వివరాలను వెల్లడిస్తున్నారు. ఈ సందర్భంగా కొత్త పింఛన్ల కోసం ఆయా గ్రామాల్లోని అర్హులైన వారు భారీగా దరఖాస్తులు చేసుకుంటున్నారు. ఒక్కో గ్రామానికి కనీసం 50 నుంచి నుంచి వంద వరకు పింఛన్ల దరఖాస్తులు వస్తున్నాయని అధికారులు చెబుతున్నారు. మేజర్ గ్రామపంచాయతీల్లో 100కి పైగా దరఖాస్తులు చేసుకున్నారని చెబుతున్నారు. చివరిసారిగా 2022 ఆగస్టు ఆగస్టు 31వ తేదీన పింఛన్లు మంజూరు చేసింది. మూడున్నరేళ్లుగా కొత్త దరఖాస్తుదారులకు పింఛన్ మోక్షం కలగడం లేదు.

దరఖాస్తులపై రాని స్పష్టత..
ఆన్లైన్ లో దరఖాస్తుకు సంబంధించిన విధి విధానాలపై స్పష్టత రాకపోవడంతో ఆసరా పెన్షనర్లు ఇబ్బందులు పడుతున్నారు. ముఖ్యంగా వృద్ధులు, దివ్యాంగులు నరకయాతన పడుతూ నిత్యం కార్యాలయాల చుట్టూ కాళ్లు అరిగేలా తిరుగుతున్నారు. అధికార వర్గాలు కూడా దీనిపై కచ్చితమైన సమాచారం చెప్పకపోవడంతో అవస్థలు పడుతున్నారు. పెన్షన్ కోసం చేసిన దరఖాస్తులు గ్రామ కార్యదర్శికి ఇవ్వాలా? ఎంపీడీఓ కార్యాలయాల్లో సమర్పించాలా? అనేది తెలియకపోవడంతో మధ్యలోనే ఆగిపోతున్నారు. దీనిపై ప్రభుత్వం స్పష్టత ఇచ్చే వరకు వేచిచూడాల్సి వస్తోంది. కాగా మండలంలో ఇప్పటికే 3349 మంది ఆసరా లబ్ధిదారులు ఉన్నారు. వీరికి ప్రతి నెల రూ.8.228 లక్షలు ప్రభుత్వం చెల్లిస్తోంది. ఇందులో వృద్ధ్యాప్య పెన్షన్ లబ్ధిదారులు 1194,వితంతువులు 1525,వికలాంగులు 530,గితకార్మికులు 66,చేనేత 8,ఒంటరి 26 లబ్దిదారులున్నారు.

ప్రభుత్వానికి నివేదించాం: శ్రీరామూర్తి.. మండల ఇంఛార్జి ఎంపిడిఓ
కొత్త పింఛన్ కోసం అభ్యర్థులు దరఖాస్తు చేసుకున్నారు. వారి వివరాలను ప్రభుత్వానికి నివేదించాం.ప్రభుత్వం కొత్త పించన్ల మంజురు చేయాల్సి ఉంది.ప్రభుత్వం మంజురు చేసిన వెంటనే కొత్తపించన్లు వస్తాయి.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -