ఓటీటీలో లావణ్య, వరుణ్ ల పెళ్లి వీడియో.. ఎక్కడంటే..!

నవతెలంగాణ – హైదరాబాద్: మెగా ఫ్యామిలీ అభిమానులకు శుభవార్త.. ఇటీవల ఇటలీలోని టుస్కానీలో జరిగిన వరుణ్ తేజ్, లావణ్య త్రిపాఠీ వేడుకను మీ ఇంట్లోనే కూర్చుని చూసే అవకాశాన్ని నెట్ ఫ్లిక్స్ మీ ముందుకు తీసుకువస్తోంది. వరుణ్ లావణ్యల పెళ్లికి సంబంధించిన వేడుకలను త్వరలో ప్రసారం చేయనుంది. ఇందుకోసం రూ.8 కోట్లతో మెగా ఫ్యామిలీతో ఓటీటీ దిగ్గజం డీల్ కుదుర్చుకుందని సమాచారం. అంటే, త్వరలోనే ఈ జంట వివాహ క్షణాలను మనమూ చూడొచ్చన్నమాట. అయితే, దీని గురించి నెట్‌ ఫ్లిక్స్ కంపెనీ నుంచి కానీ లావణ్య, వరుణ్ నుంచి కానీ ఎలాంటి అధికారిక ప్రకటన రాలేదు. నవంబర్ 1న ఇటలీలోని టుస్కానీలో జరిగిన ఈ వివాహ వేడుకకు ఇరు కుటుంబసభ్యులు, సన్నిహితులు హజరయ్యారు. రామ్ చరణ్, పవన్ కళ్యాణ్, అల్లు అర్జున్, సాయి ధరమ్ తేజ్, వైష్ణవ్ తేజ్, నితిన్ వరుణ్, లావణ్య పెళ్లి వేడుకలలో సందడి చేశారు. ఇందుకు సంబంధించిన వీడియోలు, ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. ఇటలీలో పెళ్లి వేడుకకు హాజరుకాలేక పోయిన బంధుమిత్రుల కోసం మెగా ఫ్యామిలీ హైదరాబాద్ లో లావణ్య, వరుణ్ ల రిసెప్షన్ వేడుక జరిపించిన విషయం తెలిసిందే!

Spread the love