వే బిల్లులు లేకుండా మహారాష్ట్రకు తరలి వెళ్తున్న సర్కులారిని పట్టుకున్న ఏ సిటీ ఓ

 – 24 గంటల తర్వాత నిజామాబాద్ జెయింట్ కమిషనర్ కు సరుకు లారీ తరలింపు

 – విలేకరులు సందర్శించే వరకు సరుకు లారీపై చర్యలు కరువు ప్రశ్నిస్తే నిజామాబాదుకు తరలిస్తున్నట్లు ఏ సి టి ఓ వివరణ,
నవతెలంగాణ- మద్నూర్ :
వాణిజ్య పన్నుల శాఖ సర్కు లారీలపై ఆకస్మిక తనిఖీలు చేపట్టే కార్యక్రమంలో భాగంగా హైదరాబాదు నుండి మహారాష్ట్రలోని నాందేడ్ కు వెళ్తున్న ఒక సర్కులారి వే బిల్లులు లేకుండా తరలి వెళ్తుండగా హైవే రోడ్డు తనిఖీ ఏసీటీవో అధికారి కరుణాకర్ లారీని పట్టుకొని 24 గంటల వరకు ఆ సర్కులారి పట్ల ఎలాంటి చర్యలు తీసుకోకపోవడం ఈ విషయాన్ని విలేకరులకు సమాచారం. అందడంతో మద్నూర్ మండలంలోని హెచ్ కేలూర్ పరిధిలోని ఒక పత్తి మిల్లులో సర్కు లారీని సాటుగా నిలబెట్టి బెరా సారాలు జరుపుతున్న సమాచారం విలేకరుల దృష్టికి రావడంతో ఆ పత్తి మిల్లులో జరిగే సర్కులర్ పట్ల విలేకరులు సందర్శించి లారీని పట్టుకున్న ఏ సి టి ఓ కరుణాకర్ ను ప్రశ్నించగా లారీని పట్టుకున్నాం. నిజమే హమాలీలు దొరకక సరుకు పరిశీలించలేకపోయామని ప్రస్తుతం పట్టుబడ్డ సర్కులారిని నిజామాబాద్ జైంట్ కమిషనర్ కు అప్పగిస్తున్నట్లు విలేకరులకు వివరణ ఇచ్చారు. 24 గంటలుగా పట్టుకున్న లారీని ఎలాంటి చర్యలు చేపట్టకపోవడం కారణమేమిటని ఆ ఏ సిటీ ఓ అధికారిని విలేకరులు ప్రశ్నించగా అమాలీలు దొరకడం లేదని ఈ లారీని నిజామాబాద్ జిల్లా అధికారులకు అప్పగిస్తున్నట్లు తెలిపారు. వే బిల్లులు లేకుండా తరలి వెళ్తున్న సర్కు లారీలను హైవే రోడ్డుపైన ఏ సిటీ ఓ అధికారులు ఆకస్మిక తనిఖీలు ఏ విధంగా చేపడుతున్నారనేది ప్రజల్లో పలు రకాల అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. విలేకరులు సందర్శిస్తే గాని పట్టుకున్న సర్కులారిని 24 గంటల వరకు ఎలాంటి చర్యలు చేపట్టకపోవడం పలు అనుమానాలకు దారితీస్తుంది తనిఖీ అధికారులు బేరాసారాలకు పాల్పడుతున్నారని ఆరోపణలు ప్రజల్లో వ్యక్తం అవుతున్నాయి. వే బిల్లులు లేకుండా ప్రభుత్వానికి ఇన్కమ్ టాక్స్ కట్టకుండా హైదరాబాద్ వైపు నుండి మహారాష్ట్ర వైపు వెళ్లే లారీ నెంబర్ ఎంహెచ్ 34, ఎం 16 18 ఈ నంబర్ గల లారీ 24 గంటల వరకు ఒక పత్తి మిల్లులో దాచి పెట్టి విలేకరుల దృష్టి పడడంతో ఆ సర్కులారిని నిజామాబాదుకు తరలిస్తున్నట్లు అధికారి ఇచ్చిన వివరణ నిజమేనా కాదా అనేది జిల్లా అధికారులు దీనిపై సమగ్ర విచారణ చేపడితే కానీ తనికి అధికారుల నిఘ ఏ విధంగా కొనసాగుతుందనేది జిల్లా అధికారులు హైవే రోడ్డు తనిఖీ అధికారులపై దృష్టి పెట్టవలసిన అవసరం ఎంతైనా ఉందని మండల ప్రజలు కోరుతున్నారు.
Spread the love