Monday, April 27, 2026
E-PAPER
Homeజాతీయంకోర్టు విచారణకు హాజరుకాను: కేజ్రీవాల్

కోర్టు విచారణకు హాజరుకాను: కేజ్రీవాల్

- Advertisement -

నవతెలంగాణ – హైదరాబాద్ : ఢిల్లీ ఎక్సైజ్ పాలసీ కేసులో ఆమ్ ఆద్మీ పార్టీ జాతీయ కన్వీనర్ అరవింద్ కేజ్రీవాల్ అనూహ్య నిర్ణయం తీసుకున్నారు. ఈ కేసుకు సంబంధించి ఢిల్లీ హైకోర్టులో జరుగుతున్న విచారణకు తాను వ్యక్తిగతంగా గానీ, తన లాయర్ ద్వారా గానీ హాజరుకాబోనని స్పష్టం చేశారు. ఈ మేరకు సోమవారం విచారణ జరుపుతున్న జస్టిస్ స్వర్ణకాంత శర్మకు ఆయన నేరుగా లేఖ రాశారు. “జస్టిస్ స్వర్ణకాంత గారి నుంచి నాకు న్యాయం జరుగుతుందన్న నమ్మకం పోయింది. అందుకే నేను మహాత్మా గాంధీ చూపిన సత్యాగ్రహ మార్గాన్ని అనుసరించాలని నిర్ణయించుకున్నాను” అని కేజ్రీవాల్ తన లేఖలో పేర్కొన్నారు. తన అంతరాత్మను అనుసరించి ఈ నిర్ణయం తీసుకున్నానని, జస్టిస్ స్వర్ణకాంత నిర్ణయాన్ని సుప్రీంకోర్టులో సవాల్ చేసే హక్కును వినియోగించుకుంటానని ఆయన తెలిపారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -