పద్మశాలీల అభ్యున్నతికి కృషి చేస్తా

– నిజామాబాదు పార్లమెంటు సభ్యుడు దర్మపురి అర్వింద్ 
నవతెలంగాణ – కంటేశ్వర్
పద్మశాలీల అభ్యున్నతికి కృషి చేస్తానని నిజామాబాద్ పార్లమెంట్ సభ్యుడు ధర్మపురి అరవింద్ అన్నారు.తాను ఎంపిగా గెలవడంలో పద్మశాలీలది కీలకపాత్ర అని ఆయన గుర్తు చేశారు. ఆదివారం నిజామాబాదు నగరంలోని బస్వా గార్డెన్స్ లో నిజామాబాదు జిల్లా పద్మశాలి సంఘం నూతన కార్యవర్గ ప్రమాణస్వీకార కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమానికి ఎంపి అర్వింద్ ముఖ్యాతిధిగా హాజరయ్యారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ..నిజామాబాదు కార్పోరేషన్ లో కూడా పద్మశాలీల తోడ్పాటుతో 28 కార్పోరేటర్ స్థానాల్లో బీజేపీ విజయం సాదించిందని పేర్కొన్నారు. మొన్నటి ఎన్నికల్లో పద్మశాలి సామాజిక వర్గానికి చెందిన  బోగ శ్రావణికి జగిత్యాల్ లో బీజేపీ అసెంబ్లీ టికెట్ ఇచ్చిందని గుర్తు చేశారు. పద్మశాలి అయిన కొండ లక్ష్మణ్ బాపూజీ ముఖ్యమంత్రి ఎందుకు కాలేదో పద్మశాలీలు ఆలోచించుకోవాలని పరోక్షంగా కాంగ్రెస్ ను విమర్షిస్తూ అర్వింద్ పేర్కొన్నారు. జిల్లాలో పద్మశాలీల అభివృద్ధి కోసం రెండు కోట్ల రూపాయల వరకు నిధులు ఎంపి ఫండ్ నుంచి ఇచ్చానని చెప్పారు. విశ్వకర్మ రుణాలు ముద్ర రుణాలు అత్యధికంగా నిజామాబాదు పార్లమెంటు స్థానానికి వచ్చాయని ఆయన గుర్తు చేశారు. నిజామాబాదు పార్లమెంటు పరిదిలో వేల కోట్లతో హైవేలు,రైల్వే ఓవర్ బ్రిడ్జిల నిర్మాణం చేపట్టానని అర్వింద్ పేర్కొన్నారు. రామరాజ్య స్థాపన కోసం అందరం కృషి చేద్దామని ఆయన పిలుపునిచ్చారు.నిజామాబాదు అర్బన్ శాసనసభ్యులు దన్ పాల్ సూర్యనారాయణ మాట్లాడుతూ..కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం పద్మశాలి కార్పోరేషన్ కు ఆరు నెలల్లోనే వెయ్యి కోట్ల నిధులివ్వాలని లేనిపక్షంలో బీజేపీ ఎమ్మెల్యేలమంతా కలిసి అసెంబ్లీలో ప్రభుత్వాన్ని నిలదీస్తామన్నారు. నిజామాబాదు రూరల్ శాసనసభ్యులు డాక్టర్ భూపతి రెడ్డి మాట్లాడుతూ.. పద్మశాలి సంఘ భవనం కోసం రెండెకరాల భూమి కేటాయింపజేస్తామని, పద్మశాలీలు రాజకీయంగా ఎదిగేలా కృషి చేస్తామన్నారు.మాజీమంత్రి బాల్కొండ ఎమ్మెల్యే వేముల ప్రశాంత్ రెడ్డి మాట్లాడుతూ.  పద్మశాలీలకు అండగా ఉంటామని వారి కష్టసుఖాల్లో పాలుపంచుకుంటామని అన్నారు.ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి మాట్లాడుతూ..స్వాతంత్ర్య పోరాటంలో పద్మశాలీల పాత్ర మరవరానిదని .కొండా లక్ష్మణ్ బాపూజీ తదితర పద్మశాలీ నేతలు స్వాతంత్ర్య ఉద్యమంతో పాటు తెలంగాణ ఉద్యమంలో అలుపెరగని పాత్ర పోషించారని గుర్తు చేశారు. ఇంకా ఈ కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యే బాజిరెడ్డి గోవర్దన్, మినరల్ డెవలప్‌మెంట్ చైర్మెన్ ఈరవత్రి అనిల్,ఉర్దూ అకాడమీ చైర్మన్ తాహెర్ బిన్ హందాన్,జిల్లా పద్మశాలి సంఘం గౌరవాద్యక్షులు దీకొండ యాదగిరి, అద్యక్షులు బిజ్జు దత్తాద్రి,వర్కింగ్ ప్రెసిడెంట్ పుల్గం హన్మాండ్లు,ప్రధాన కార్యదర్శి అవదూత దశరథం,కోశాధికారి గుడ్ల భూమేశ్వర్,పద్మశాలి సంఘం  నాయకులు గోస్కె యాదగిరి,బూర మల్లేశం, రాపెల్లి గురుచరణం, గుజ్జేటి వెంకటనర్సయ్య, రాపోలు సుధాకర్,చింతల గంగాదాస్ తదితరులు పాల్గొన్నారు.
Spread the love