పోరాడే లౌకికవాదులను గెలిపించండి..      

– సీపీఐఎంఎల్ న్యూ డెమోక్రసీ రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యుడు గోవర్ధన్ 
నవతెలంగాణ – నెల్లికుదురు 
పోరాడే లౌకిక వాదులను గెలిపించాలని సీపీఐ ఎమ్మెల్యే న్యూ డెమోక్రసీ రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యుడు గోవర్ధన్ అన్నాడు. మండల కేంద్రంలో ఉపాధి కూలీల వద్దకు వెళ్లి సీపీఐ ఎంఎల్ న్యూ డెమోక్రసీ తోరూర్ డివిజన్ కార్యదర్శి ఆలకుంట్ల సాయన్న అధ్యక్షతన సీపీఐ ఎంఎల్ న్యూడెమోక్రసీ మహబూబాద్ పార్లమెంట్ అభ్యర్థి మోకాళ్ళ మురళీకృష్ణ ను గెలిపించాలని ఓటర్లను బుధవారం కోరారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ..  పార్లమెంట్ ఎన్నికలలో బీజేపీ ప్రభుత్వం అనుసరిస్తున్న ప్రజా వ్యతిరేక కార్మిక వ్యతిరేక విధానాలను వ్యతిరేకంగా నిలబడిన కొట్లాడే సీపీఎంఎల్ న్యూ డెమోక్రసీ అభ్యర్థి మోకాల మురళీకృష్ణ కుండ గుర్తుకు ఓటు వేసి గెలిపించాలని భారత కార్మిక సంఘల సమాఖ్య రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గోవర్ధన్ ప్రజలను విజ్ఞప్తి చేశారు ఏజెన్సీ ప్రాంతంలో గల అపార  సంపదను ప్రకృతి వనరులను దోచుకోవడం కోసం కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు గత అనేక సంవత్సరాలుగా తీవ్రంగా ప్రయత్నం చేస్తున్నాయి. ప్రకృతి వనరులు బహుళ జాతి కంపెనీలకు అంబానీ ఆదాని సంస్థలకు కట్టబెట్టే పాలకుల కుట్రలకు వ్యతిరేకంగా పార్టీ అనేక కార్యక్రమాలు కొనసాగించింది అని అన్నారు. బయ్యారం స్టీల్ ఫ్యాక్టరీని వెంటనే స్థాపించాలని డిమాండ్ చేశారు.
ఏనాటినుండి ఆందోళన చేస్తుంది అని తెలిపారు. అటవీ సంరక్షణ నియమాల పేరుతో స్థానిక ఆదివాసులను గిరిజనులను అడవి నుండి వెళ్లగొట్టి దుష్ట చర్యలకు పాల్బడుతుంది గోదావరిలోయ పరివాహక ప్రాంతంలో ఆదివాసులు గిరిజనులను బడుగు బలహీన వర్గాల ప్రజలను. దున్నేవారికి భూమి అని నినాదంతో కదిలించి లక్షలాది ఎకరాల భూమిని సాధించుకోవడంతో పాటు వాటికి పట్టాలు సాధించింది అందుకోసం ఐక్యంగా పోరాడిన చరిత్ర సీపీఐ ఎంఎల్ న్యూ డెమోక్రసీ ఉన్నది. భూమికోసం, భుక్తి కోసం, విముక్తి కోసం నూతన ప్రజాస్వాముక విప్లవమే ఏకైక మార్గంగా విశ్వాసించి పోరాడుతున్నది. అందులో భాగంగానే ప్రతిఘటన పోరాటాల కు కట్టుబడి ఉమ్మడి వరంగల్ ఖమ్మం జిల్లాలో అసమాన నెత్తుటి త్యాగాలతో బూటకపు ఎన్కౌంటర్ తప్పుడు కుట్ర కేసులను ఎదురుకుంటూ శతాబ్ద తరబడి నిస్వార్ధంగా నిజాయితీగా కృషి చేస్తున్నటువంటి పార్టీ అభ్యర్థి కి ఓటు వేసి గెలిపించాలని కోరారు. ఈ కార్యక్రమంలో జిల్లా నాయకులు హెచ్ లింగన్న ఊడుగుల లింగన్న, అఖిలభారత రైతు కూలీ సంఘం తొర్రూర్ డివిజన్ కార్యదర్శి జాటోత్ భిక్షపతి,
మరియు డివిజన్ నాయకులు తొట్టి హరీష్ నాగన్న రాము వీరన్న తదితరులు పాల్గొన్నారు.
Spread the love