మిషన్ భగీరథలో మహిళా దినోత్సవం

నవతెలంగాణ – హైదరాబాద్
రాష్ట్ర ప్రభుత్వం దశాబ్ది ఉత్సవాలలో భాగంగా బుధవారం హైద్రాబాద్ లోని మిషన్ భగీరథ కార్యాలయంలో ‘మహిళా దినోత్సవం’ నిర్వహించారు. ఈ కార్యక్రమాన్ని ఇంజినీర్ ఇన్ చీఫ్ ఎం.కృపాకర్ రెడ్డి ప్రారంభించారు. ఇందులో చీఫ్ ఇంజనీర్లు, మహిళా ఉద్యోగులు పాల్గొన్నారు. ఈ సంధర్బంగా క్విజ్ పోటీలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పాల్గొని గెలుపొందిన ఉద్యోగులకు ఇంజినీర్ ఇన్ చీఫ్ కృపాకర్ రెడ్డి బహుమతులు అందచేశారు. ఇందులో సీఈ వినోబా దేవి, లలిత, రంగారెడ్డి ఈ ఈ రాజేశ్వర్ రావు తదితరులు పాల్గొన్నారు. దాదాపు రెండు వందలమంది ఉద్యోగులు హజరయ్యారు. ఈ సందర్బంగా ఈఎన్సీ కృపాకర్ రెడ్డి మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం చెపట్టిన అభివృద్ధి కార్యక్రమాల అమలులో మహిళా ఉద్యోగుల పాత్ర కీలకమని వ్యాఖ్యానించారు. చురుగ్గా పనిచెయ్యడం మూలానే మిషన్ భగీరథ ప్రాజెక్టు తొందరగా పూర్తయి ఇంటింటికి తాగునీరు అందుతున్నదని చెప్పారు. ముఖ్యమంత్రి ఆలోచనను కార్యరూపంలోకి తెచ్చిన ఘనత ఉద్యోగులదేనని అన్నారు. పథకాన్ని సక్రమంగా నిర్వహించడం ద్వారా మన ఉద్యోగుల బాధ్యతను నెరవేర్చినట్టుగా భావించాలని చెప్పారు.  సీఈ లు వినోబా దేవి, లలిత మాట్లాడుతూ ప్రభుత్వం దశాబ్ది ఉత్సవాలలో భాగంగా మహిళా దినోత్సవం నిర్వహించటం పట్ల హర్షం వ్యక్తం చేశారు.

Spread the love