‘సమాజ హితం కోసం పని చేయాలి

We should work for the welfare of the society– నిజాం కళాశాల ప్రిన్సిపాల్‌ ప్రొఫెసర్‌ బి.బీమా
నవతెలంగాణ-హిమాయత్‌ నగర్‌
చాకలి ఐలమ్మ స్ఫూర్తితో విద్యార్థులు సమాజ హితం కోసం పని చేయాలని నిజాం కళాశాల ప్రిన్సిపాల్‌, ప్రొఫె సర్‌ బి.బీమా విద్యార్థులకు సూచించారు. బీసీ సెల్‌ ఆధ్వ ర్యంలో సోమవారం నిజాం కళాశాల ప్రిన్సిపాల్‌ కార్యాలయంలో తెలంగాణ సాయుధ పోరాట యోధురాలు చాకలి ఐలమ్మ వర్ధంతి కార్యక్రమాన్ని నిర్వహించారు.ఈ సందర్భంగా ఐలమ్మ చిత్రపటానికి ప్రొఫెసర్‌ బి.బీమా పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ వీరనారి ఐలమ్మ లాంటి వారి త్యాగాలతో తెలంగాణలో భూస్వామ్య వ్యవస్థ అంతరించిపోయి అన్ని వర్గాల ప్రజలకు వ్యవసాయ భూమి దక్కిందన్నారు.భూమి కోసం, భుక్తి కోసమే కాకుండా బానిసత్వ విముక్తి కోసం తెలంగాణ ప్రజల స్వేచ్ఛ స్వతంత్రాల కోసం ఐలమ్మ చేసిన పోరాటం మరువలేనిదని కొనియాడారు. ఈ కార్యక్ర మంలో నిజాం కళాశాల అకాడమిక్‌ కో-ఆర్డినేటర్‌ డాక్టర్‌ ఎస్‌.రేణుక, అసిస్టెంట్‌ కో-ఆర్డినేటర్‌ డాక్టర్‌ బి.కవిత, ఈవోసి కో-ఆర్డినేటర్‌ డాక్టర్‌ బి.తిరుపతి, రీసెర్చ్‌ సెండ్‌ డెవలప్మెంట్‌ కో-ఆర్డినేటర్‌ డాక్టర్‌ డి.సాంబశివ, డిప్లమా కోర్సెస్‌ కో-ఆర్డినేటర్‌ డాక్టర్‌ కె.భవాని శంకర్‌, విద్యార్థులు, నాన్‌ టీచింగ్‌ స్టాఫ్‌ తదితవరులు పాల్గొన్నారు.

Spread the love