అజిలాపురం లిఫ్ట్ ఇరిగేషన్ పనులకు నీటిపారుదల శాఖ మంత్రి ఎన్.ఉత్తమ్ కుమార్ రెడ్డి శంకుస్థాపన
నవతెలంగాణ- మహబూబ్‌నగర్ ప్రాంతీయ ప్రతినిధి
పాలమూరు రంగారెడ్డి లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టుతో పాటు అన్ని పెండింగ్ ప్రాజెక్టులు పనులు పూర్తి చేస్తామని నీటి పారుదల శాఖ,పౌర సరఫరాల శాఖ మంత్రి ఎన్.ఉత్తమ్ కుమార్ రెడ్డి అన్నారు.శనివారం మహబూబ్‌నగర్ జిల్లా దేవరకద్ర మండలంలో 32.05 కోట్ల రూపాయలతో నిర్మాణం చేయనున్న అజిలాపూర్ లిఫ్ట్ ఇరిగేషన్ పథకానికి రాష్ట్ర పశు సంవర్థక,మత్స్య,పాడి అభివృద్ధి,క్రీడలు,యువజన సర్వీసుల శాఖ మంత్రి వాకిటి శ్రీ హరి,రాష్ట ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షులు జి.చిన్నారెడ్డితో కలిసి శంకుస్థాపన చేశారు. అజిలాపురం లిఫ్ట్ ఇరిగేషన్ పనులు శంకుస్థాపన చేయడం సంతోషంగా ఉందని మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి అన్నారు.. ఈ లిఫ్ట్ ఇరిగేషన్ స్కీమ్ వల్ల అజిలా పురం,గద్దె గూడెం, వెంకటాయ పల్లి గ్రామాలకు 1400 ఎకరాల ఆయకట్టుకు కోయిల్ సాగర్ నుండి సాగు నీరు అందుతుందన్నారు. అదేవిధంగా కల్వకుర్తి, నెట్టెంపాడు,భీమా,తదితర ప్రాజెక్టులను గత బీఆర్‌ఎస్ ప్రభుత్వం నిర్లక్ష్యం చేసిందని తెలిపారు. వాటి పనులను కూడా పూర్తి చేస్తామన్నారు.. పాలమూరు రంగారెడ్డి లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్ట్ పనులు 90 శాతం పూర్తి చేశామని గత పాలకులు చెప్పటం అబద్ధం అన్నారు.
జూన్ 4,5 తేదీల్లో రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి జిల్లాలో పర్యటించి నిధులు మంజూరు చేయనున్నట్టు తెలిపారు. జూన్ 4 న జూరాల నుండి ప్రారంభించి 4,5 తేదీల్లో కల్వకుర్తి, నెట్టెంపాడు, భీమా, నార్లా పూర్, ఉద్దండాపూర్ రిజర్వాయర్ లను పర్యటించ నున్నట్టు తెలిపారు. వచ్చే రెండున్నర సంవత్సరం కాలంలో పూర్తి చేస్తామన్నారు. శాసన సభ్యులు జి.మధు సూదన్ రెడ్డి కోరిన విధంగా చౌదరి పల్లి లిఫ్ట్ ఇరిగేషన్ మంజూరు చేస్తానని సానుకూలంగా స్పందించారు. అదేవిధంగా పి.ఏసి.ఎస్.కొనుగోలు కేంద్రాన్ని ఉత్తమ్ కఁమార్ రెడ్డి,వాకిటి శ్రీ హరి సందర్శించారు. కొనుగోలు కేంద్రంలో కొనుగోళ్లు, ఎం.ఎస్.పి చెల్లింపు పై రైతులతో మాట్లాడారు. కొనుగోలు కేంద్రాల ద్వారా ధాన్యం కొనుగోలు చేస్తూ ఎం.ఎస్.పి.రైతుల ఖాతాల్లో జమ అవుతున్నట్లు వారు సంతోషంతో మంత్రులకు వివరించారు. కార్యక్ర మంలో జిల్లా కలెక్టర్ ఖుష్బూ గుప్తా,రెవెన్యూ అదనపు కలెక్టర్ జె.ఎల్.బి.హరిప్రియ, ఎస్పీ.డి. జానకి, సర్పంచ్ అనంతమ్మ, మాజీ జడ్పీచైర్మన్ స్వర్ణ సుధాకర్ రెడ్డి పాల్గొన్నారు
పాలమూరు -రంగారెడ్డి లిఫ్ట్ ఇరిగేషన్ సహాపెండింగ్ ప్రాజెక్టు పనులు వేగవంతం
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES



