Saturday, May 2, 2026
E-PAPER
Homeఅంతర్జాతీయంబిలియనీర్ల కన్నా కార్మికులే ముఖ్యం

బిలియనీర్ల కన్నా కార్మికులే ముఖ్యం

- Advertisement -

యుద్ధం కాదు..
ఆరోగ్య సంరక్షణ కావాలి
హక్కుల కోసం నినదించిన కార్మికలోకం
‘మే’ డే సందర్భంగా ప్రపంచవ్యాప్తంగా వీధుల్లోకి వచ్చి ఆందోళన
న్యూయార్క్‌
: అంతర్జాతీయ కార్మిక దినోత్సవాన్ని పురస్కరించుకుని శుక్రవారం ప్రపంచవ్యాప్తంగా నిరసనలు, ఆందోళనలతో కార్మికలోకం హౌరెత్తింది. ”బిలియనీర్ల కన్నా కార్మికులే ముఖ్యం’, ‘యుద్ధం కాదు, ఆరోగ్య సంరక్షణే కావాలి’ అని నినదిస్తూ కార్మికులు, శ్రామికులు బ్యానర్లు ప్రదర్శించారు. భారత్‌, పాకిస్తాన్‌తో సహా ఇరాన్‌, టర్కీ, యూరప్‌ దేశాల్లో వారు తమ హక్కుల కోసం నినదించడంతో వీధులు దద్దరిల్లాయి.అమెరికాలో..ట్రంప్‌ విధానాలను వ్యతిరేకిస్తూ వేలాది మంది కార్మికులు రోడ్లపైకి వచ్చారు. ”బడి వద్దు.. పని వద్దు.. షాపింగ్‌ వద్దు” అంటూ నినాదాలు చేశారు. వాక్‌ట్‌లు చేశారు. మార్చ్‌లు నిర్వహించారు. నల్లదుస్తులు ధరించి బ్యానర్లు ప్రదర్శిస్తూ నిరసనలు తెలిపారు. తూర్పు తీరంలో తెల్లవారుజాము నుంచే నిరసనలు ప్రారంభమయ్యాయి. మాన్‌హాటన్‌లో అమెజాన్‌ కార్మికులు, టీమ్‌స్టర్స్‌, స్థానిక రాజకీయ నాయకుల బృందం, ఐసీఈ, డిపార్ట్‌మెంట్‌ ఆఫ్‌ హోమ్‌ల్యాండ్‌ సెక్యూరిటీ (డీహెచ్‌ఎస్‌)తో ఉన్న కాంట్రాక్టులను రద్దు చేయాలని డిమాండ్‌ చేస్తూ, న్యూయార్క్‌ పబ్లిక్‌ లైబ్రరీ ప్రధాన శాఖ నుంచి సమీపంలోని అమెజాన్‌ కార్పొరేట్‌ కార్యాలయాల వరకు మార్చ్‌ నిర్వహించారు. దేశ రాజధానిలో, ఫ్రీ డీసీ సంస్థకు చెందిన కార్మికులు ”బిలియనీర్ల కన్నా కార్మికులే ముఖ్యం” , ”యుద్ధం కాదు, ఆరోగ్య సంరక్షణే కావాలి” అని రాసి ఉన్న బ్యానర్లను ప్రదర్శిస్తూ నగరం అంతటా కూడళ్లను వ¶సివేశారు. జనవరిలో మిన్నెసోటాలో జరిగిన ఇలాంటి సమన్వయ ప్రయత్నానికి కొనసాగింపుగా ఈ నిరసనలు కొనసాగాయి.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -