Saturday, May 2, 2026
E-PAPER
Homeరాష్ట్రీయంకార్మికుల హక్కుల దినం మేడే : సీతక్క

కార్మికుల హక్కుల దినం మేడే : సీతక్క

- Advertisement -

నవతెలంగాణ – ములుగు/కాశీబుగ్గ/హనుమకొండ చౌరస్తా/సుబేదారి
ములుగు జిల్లా కేంద్రంలో సీఐటీయూ ఆధ్వర్యంలో మున్సిపల్‌ కార్యాలయం ముందు, సీఐటీయూ జిల్లా కార్యాలయం ముందు శుక్రవారం మేడే కార్యక్రమం నిర్వహించారు. కాగా, మున్సిపల్‌ కార్యాలయం వద్ద మంత్రి సీతక్క ముఖ్యఅతిథిగా హాజరై అరుణ పతాకాన్ని ఆవిష్కరించారు. సభ అనంతరం కార్మికులు మున్సిపల్‌ కార్యాలయం నుండి బస్టాండ్‌ వరకు పెద్ద ఎత్తున ర్యాలీ తీశారు. ములుగు మున్సిపల్‌ కార్యాలయం వద్ద సీఐటీయూ జిల్లా కార్యదర్శి రత్నం రాజేందర్‌ అధ్యక్షతన జరిగిన మేడే సభలో మంత్రి సీతక్క మాట్లాడారు. కార్మికులకు విశ్రాంతి , వినోదం ఉండే విధంగా పని గంటలు కల్పించాలని మంత్రి సీతక్క కోరారు.

సమాజంలో సంపదకు మూలం కార్మికుల శ్రమ : మంత్రి కొండా సురేఖ
సమాజంలో సంపదకు మూలం కార్మికుల శ్రమ అని, కార్మికుల శ్రమను గుర్తించి గౌరవించాలని రాష్ట్ర అటవీ, పర్యావరణ, దేవాదాయ శాఖల మంత్రి కొండా సురేఖ అన్నారు. శుక్రవారం వరంగల్‌ జిల్లా కూరగాయల మార్కెట్‌ లో హమాలీ యూనియన్‌ గౌరవ అధ్యక్షుడు భోగి సురేష్‌ అధ్యక్షతన జరిగిన మేడే వేడుకలకు మంత్రి కొండా సురేఖ హాజరై జెండా ఆవిష్కరించారు. హమాలీ కార్మికులు విశ్రాంతి తీసుకునేందుకు, భోజనాలు చేయడానికి రూ.60లక్షల మున్సిపల్‌ నిధులతో కమ్యూనిస్ట్ హాల్‌ మంజూరు చేసామని త్వరలో పనులు ప్రారంభం అవుతాయన్నారు. కార్మికుల దినోత్సవం సందర్భంగా వరంగల్‌ పశ్చిమ నియోజకవర్గ ఎమ్మెల్యే నాయిని రాజేందర ్‌రెడ్డి కార్మిక జెండా ఎగురవేశారు. దేశ నిర్మాణానికి కార్మికులు మూల స్తంభా లంటూ గ్రేటర్‌ వరంగల్‌ నగర మేయర్‌ గుండు సుధారాణి పేర్కొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -