కార్మికుల సమస్యలను తక్షణమే పరిష్కరించాలి..

– మంత్రి కాన్వాయ్ ని అడ్డుకోవడానికి ప్రయత్నం చేసిన సీపీఎం, ఏఐఎస్ఎఫ్ నాయకులు
నవతెలంగాణ హుస్నాబాద్ రూరల్
గ్రామపంచాయతీ కార్మికుల సమస్యలు తక్షణమే పరిష్కరించకపోతే సకల జనులను ఏకం చేసి ఉద్యమాన్ని ఉదృతం చేస్తామని సిపిఎం నాయకులు గూగులోత్ శివరాజ్ ఏఐఎస్ఎఫ్ జిల్లా ప్రధాన కార్యదర్శి జేరిపోతుల జనార్దన్ అన్నారు . సోమవారం గ్రామ పంచాయతీ కార్మికులకు సంఘీభావం ప్రకటించారు. సమ్మెలో పాల్గొని మాట్లాడే సమయంలో మంత్రి హరీష్ రావు  రోడ్ మార్గం వెళ్తుండగా సీపీఎం, ఏఐఎస్ఎఫ్ నాయకులు  కార్మికులతో కలిసి మంత్రి వాహనానికి అడ్డుకునే ప్రయత్నం చేశారు. పోలీసులు అడ్డుకుని కాన్వాయ్ నీ పంపించారు. ఈ సందర్భంగా సీపీఎం, ఏఐఎస్ఎఫ్ నాయకులు శివరాజ్,జనార్ధన్ మాట్లాడుతూ గ్రామపంచాయతీ కార్మికులు చేస్తున్న చట్టబద్ధమైన న్యాయబద్ధమైన డిమాండ్లు పరిష్కరించకుండా ప్రభుత్వం నిర్లక్ష్యం చేస్తుందని ఆరోపించారు. పారిశుద్ధ కార్మికులను రాష్ట్ర ప్రభుత్వం చిన్న చూపు చూస్తుందని అన్నారు. కార్మిుల శ్రమతో అభివృద్ధి పేరా ప్రశంస పత్రాలు అందుకుంటున్నరని విమర్శించారు. నాయకులకు కార్మికుల శ్రమ గుర్తుకు రావట్లేదా అని ప్రశ్నించారు.గ్రామపంచాయతీ కార్మికుల సమస్యల  పరిష్కారం చేయకపోతే సమ్మె ఉర్దృతం చేస్తామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో నాయకులు వేల్పుల ప్రసన్న కుమార్, గుగులోతూ రాజ్ నాయక్, కార్మిక నాయకులు దుర్గయ్య, శ్రీనివాస్ లు, కార్మికులు తదితరులు పాల్గొన్నారు.

Spread the love