కార్మికులు ఐక్యంగా ఉండి హక్కులు సాధించుకోవాలి

– మాజీ ఎమ్మెల్యే జూలకంటి రంగారెడ్డి
– ప్రమాద కార్మికుడికి బియ్యం, నగదు సాయం
నవతెలంగాణ-మిర్యాలగూడ
కార్మికుల ఐక్యంగా ఉండి హక్కులు సాధించుకోవాలని మాజీ ఎమ్మెల్యే జూలకంటి రంగారెడ్డి కోరారు. పెయింటింగ్‌ పని కోసం బైకుపై వెళుతుండగా ప్రమాద శాత్తు కాలికి గాయమైన కార్మికుడు పందుల వినోద్‌కు బిల్డింగ్‌ పెయింటింగ్‌ వర్కర్స్‌ యూనియన్‌ ఆధ్వర్యంలో 50 కేజీల బియ్యం, 5వేల రూపాయల నగదు అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కార్మికులు తమ సమస్యల పరిష్కారం కోసం ఉద్యమాలు చేయాలన్నారు. ఆపదలో ఉన్న కార్మికులను కార్మిక సంక్షేమశాఖ బోర్డు సాయం చేసి ఆదుకోవాలన్నారు. సంక్షేమ బోర్డు ద్వారా అనేక పథకాలు కార్మికులకు వర్తింపజేయాలని డిమాండ్‌ చేశారు. ప్రతి కార్మికుడు సంఘంలో సభ్యత్వం తీసుకొని గుర్తింపు కార్డు పొందాలన్నారు. ఆపదలో ఉన్న కార్మికుడిని తోటి కార్మికులు సహాయ సహకారాలు అందించాలన్నారు. ఈ కార్యక్రమంలో మాజీ మున్సిపల్‌ వైస్‌ చైర్మెన్‌ డబ్బికార్‌ మల్లేష్‌, సీఐటీయూ జిల్లా సహాయ కార్యదర్శి డాక్టర్‌ మల్లు గౌతమ్‌రెడ్డి, భవన నిర్మాణ కార్మిక సంఘం జిల్లా ఉపాధ్యక్షులు బీఎం.నాయుడు, మిర్యాలగూడ బిల్లింగ్‌ పెయింటింగ్‌ వర్కర్స్‌ యూనియన్‌ అధ్యక్షులు మందరాజు, ప్రధాన కార్యదర్శి ఎస్పీ సైదులు నాయక్‌, ఉపాధ్యక్షులు వలపట్ల సురేందర్‌, కోశాధికారి పాశం గోవర్ధన్‌రెడ్డి, కోటి తదితరులు పాల్గొన్నారు.

Spread the love