న్యూఢిల్లీ : ప్రముఖ స్మార్ట్‌ఫోన్, స్మార్ట్ టివి బ్రాండ్ షావోమి ఇండియా తన ‘మేక్ ఇన్ ఇండియా’ ప్రయాణాన్ని బలోపేతం చేయడానికి ఆప్టిమస్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్‌తో భాగస్వామ్యం కుదుర్చుకున్నట్లు తెలిపింది. కేబుల్‌రహిత ఆడియో ఉత్పత్తులను స్థానికంగా తయారు చేయడానికి ఈ ఒప్పందం చేసుకున్నట్లు పేర్కొంది. ఈ విభాగంలో దేశీయ ఛాంపియన్లతో కార్యకలాపాల విస్తరణ, తయారీ భాగస్వామ్యాల ద్వారా షావోమి భారత్ పట్ట తన నిబద్ధతను బలోపేతం చేస్తుందని తెలిపింది. వచ్చే రెండేండ్లలో స్మార్ట్‌ఫోన్ దేశీయ విలువ జోడింపులో 50 శాతం పెరుగుదలను లక్ష్యంగా పెట్టుకున్నట్లు తెలిపింది.