రాహుల్ గాంధీతోనే దేశం అభివృద్ధి: ఎదల యాదవ రెడ్డి 

– బీజేపీ, బీఆర్ఎస్ పార్టీ ప్రజల అభివృద్ధి పట్టించుకున్న పాపాన పోలేదు
నవతెలంగాణ – నెల్లికుదురు 
దేశంలో రాహుల్ గాంధీ ప్రధాని కాబోతున్నాడని ఆయనతోనే దేశం సమగ్ర అభివృద్ధి చెందుతుందని  మహబూబాద్ బ్లాక్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు ఎద యాదవ రెడ్డి మాజీ బ్లాక్ అధ్యక్షుడు నాయిని సత్యపాల్ రెడ్డి మాజీ జెడ్పిటిసి హెచ్ వెంకటేశ్వర్లు వైస్ ఎంపీపీ జిల్లా వెంకటేష్ ఆ పార్టీ జిల్లా ఉపాధ్యక్షుడు గుగులోతు బాలాజీ నాయక్ పార్టీ మండల అధ్యక్షుడు గొల్లపల్లి ప్రభాకర్ గౌడ్ అన్నారు. మండలంలోని బ్రాహ్మణ కొత్తపల్లి గ్రామంలో ఈజిఎస్ కూలీల వద్దకు వెళ్లి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి పోరిక బలరాం నాయకు న్ని గెలిపించాలని శుక్రవారం ప్రచార నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. కాంగ్రెస్ పార్టీ కేంద్రంలో అధికారం రాబోతుందని దీంతో రాహుల్ గాంధీ ప్రధానమంత్రి అవుతున్నాడని అన్నారు. అందుకోసం ఇక్కడ ఉన్న కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి పోరిక బలరాం నాయకుడు అధిక మెజార్టీతో గెలిపించాలని కోరుతున్నట్లు తెలిపారు. రాహుల్ గాంధీ ప్రధాని కాగానే ఎన్ఆర్ఈజీఎస్ ఉపాధి హామీ  కూలీలకు రోజువారీగా రూ.400 రూపాయలు చెల్లిస్తారని అన్నారు. ఈ ఎన్నికలు అయిపోగానే రైతులకు రెండు లక్షల రుణమాఫీ చేస్తాడని తెలిపాడు. అంతే కాకుండా మహిళలకు నెలకు రూ.2500 చెల్లించి ఏర్పాట్లు చేశారని అన్నారు. కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీలను అమలు తప్పక చేస్తుందని ఇప్పటికే కొన్ని చేసిందని అన్నారు వంద రోజుల్లోనే ఇన్ని పథకాలను అమలు చేసిన ఘనత కేవలం కాంగ్రెస్ పార్టీకి దక్కిందని అన్నారు. 10 సంవత్సరాలు అధికారంలో ఉన్న కేసీఆర్ ప్రజలకు చేసింది ఏమి లేదని తెలిపారు. మాయబడులతో కాలయాపన చేశారు తప్ప ప్రజల అభివృద్ధి పట్టించుకున్న పోలేదని ఆవేదన వ్యక్తం చెందారు. వంద రోజులు కాగానే ఏమైందని ప్రశ్నిస్తున్న బీజేపీ, బీఆర్ఎస్ పార్టీలకు తక్కువ రోజుల్లో ఇంత అభివృద్ధి చేసిన సోయలేకుండా అధికారం పోతుందనే ఆలోచనతో పిచ్చిపిచ్చి మాటలు మాట్లాడుతున్నారని అన్నారు. అలాంటి పార్టీల నేతలకు ఓటర్లు గుణపాఠం చెప్తారని అన్నారు. ఈ కార్యక్రమంలో నాయకులు పెరుమాళ్ళ మల్లేశం పిట్టల మురళి చిన్నబోయిన శ్రీనివాస్ పెరుమాళ్ళ శంకర్ పెరుమాండ్ల శ్రీధర్ కోళ్ల బిక్షం జేల్లా యాకయ్య పట్నం శెట్టి నాగరాజు గొర్రె అశోక్ పిడుగు రాము ఎండి ఇస్మాయిల్ యాకోబు పాష ఆశోద బీముడు సోమయ్య పిడుగు వెంకట సొమలు పిడుగు వెంకటయ్య జిల్లా మండల గ్రామ నాయకులు పాల్గొన్నారు.
Spread the love