ఆశా వర్కర్లకు ఉద్యోగ భద్రత కల్పించాలి యేశాల గంగాధర్

నవతెలంగాణ- కోటగిరి: కోటగిరి మండల కేంద్రంలో కొన్ని రోజుల నుండి ఆశా వర్కర్లు వారి డిమాండ్ నిర్వహించాలని నిరవధికంగా  సమ్మె నిర్వహిస్తున్న ఆశా వర్కర్లకి  గాంధీ జయంతి  పురస్కరించుకొని జిల్లా వ్యవసాయ కార్మిక సంఘం అధ్యక్షులు యేశాల గంగాధర్ సోమవారం సంఘీభావం తెలిపారు. ఈ  యేశాల గంగాధర్ వికలాంగుల హక్కుల జాతీయ వేదిక జిల్లా ఉపాధ్యక్షులు గైని రాములు మాట్లాడుతూ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఆశ వర్కర్లతో నిరంతరం ప్రజల సమస్యల కోసం పనిచేయటానికి నియమించుకొని అనేక కార్యక్రమాలు పనులు చేయిస్తూ, గత ఎనిమిది రోజులుగా నిరవదిక  సమ్మె  చేస్తున్న ప్రభుత్వము గాని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వము  వారి సమస్యలు పరిష్కారం చేయకుండా కాలయాపన చేస్తూ ఆశ వర్కర్లకు భయభ్రాంతులకు గురిచేస్తూ సమ్మెను రమింపజేయాలని కుటిల ప్రయత్నాలు చేస్తున్నారని, వారు అడిగిన ఒక్క డిమాండ్లు ప్రధానంగా నెలకు 18 వేల రూపాయలు ఇవ్వాలని, ఉద్యోగ భద్రత కల్పించాలని, పిఎఫ్ ఈఎస్ఐ సౌకర్యం కల్పించాలని, ప్రమాద బీమా ఐదు లక్ష రూపాయలు ఇవ్వాలని, పెండింగ్లో ఉన్న బకాయి బిల్లులు చెల్లించాలని, అర్హులైన ఆశ వర్కర్లకు కేంద్ర ప్రభుత్వము, రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెడుతున్న అనేక సంక్షేమ పథకాలు అమలు చేయాలని  డిమాండ్ చేశారు అంతకుమునుపు ఆశా వర్కర్లు గాంధీజీ విగ్రహానికి వినతి పత్రం సమర్పించారు. ఈ కార్యక్రమంలో ఆశ వర్కర్ల మండల అధ్యక్షురాలు సుజాత ,మండల కార్యదర్శి అనురాధ, మండల కోశాధికారి స్వప్న,  ఆశా వర్కర్లు,లక్ష్మి ,రమ ,మహేశ్వరి లలిత, చంద్రకళ తదితరులు పాల్గొన్నారు
Spread the love