వైఖరి ప్రకటించకే సమావేశానికి రావాలి

– తల్లిపాలు తాగి రొమ్ము గుద్దే నాయకులను అడ్డుకుంటాం 
– గౌడ్ గౌడ సంఘం స్టేట్ జేఏసీ మహిళ నాయకురాలు పూదరి రాజేశ్వరి
నవతెలంగాణ- హుస్నాబాద్ రూరల్: హుస్నాబాద్ లో ప్రజా సంఘాలు ఆదివారం చేపట్టే సమావేశానికి వస్తున్న జేఏసీ చైర్మన్ కవ్వా లక్ష్మారెడ్డి, రైతు రుణ విమోచన సమితి డైరెక్టర్ పాపిరెడ్డి ల వైఖరిని స్పష్టంగా ప్రకటించి సమావేశానికి హాజరుకావాలని గౌడ్ గౌడ సంఘం స్టేట్ జేఏసీ మహిళ నాయకురాలు పూదరి రాజేశ్వరి డిమాండ్ చేశారు. హుస్నాబాద్ కు వస్తున్న కవ్వ లక్ష్మారెడ్డి, రైతు రుణ విమోచన సమితి డైరెక్టర్ పాపిరెడ్డి  ఉన్నత విద్యా మండలి చైర్మన్ గా పదవులు అనుభవించారన్నారు. తల్లిపాలు తాగి రొమ్ము గుద్దే విధంగా ప్రవర్తించడం మానుకోవాలని అన్నారు. తమ వైఖరి స్పష్టం చేయకపోతే కచ్చితంగా మిమ్మల్ని అడ్డుకొని తీరుతామని హెచ్చరించారు. కెసిఆర్ కు అత్యంత దగ్గర వ్యక్తిగా ఎక్కడున్నా లక్ష్మారెడ్డి అని పలకరించే స్థాయిలో  ఉండి దిగజారుడు పనులు మానుకోవాలన్నారు. పాపి రెడ్డి ఉన్నత విద్యా మండలి చైర్మన్ గా చేసి ఇయ్యాల బీఆర్ఎస్ పార్టీ మీద బురద చల్లడానికి మీరు చేస్తున్న ప్రయత్నాన్ని మేము వ్యతిరేకిస్తూ, మిమ్మల్ని అడ్డుకోవడానికి సిద్ధంగా ఉన్నామని స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో గౌడ సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షులు బుర్ర శ్రీనివాస్ గౌడ్, ఎంపీటీసీల హుస్నాబాద్ మండల ఫోరం అధ్యక్షులు బొమ్మగాని శ్రీనివాస్ గౌడ్, బీఆర్ఎస్ నాయకురాలు బొమ్మగాని అనురాధ తదితరులు పాల్గొన్నారు.
Spread the love