సన్మానంలో చిన్న తడుగూరు గ్రామ అధ్యక్షులు
నవతెలంగాణ-మద్నూర్
మద్నూర్ మండలంలో కాంగ్రెస్ పార్టీ బలోపేతానికి మీ సేవలు అమూల్యమైనవిగా మండలంలోని చిన్నతడుగూరు గ్రామ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు గంగారాం పేర్కొన్నారు. మద్నూర్ మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షునిగా రెండవసారి ఎన్నికైన ధరాస్ సాయిలు కు ఆ గ్రామ సర్పంచ్ సూర్యవంశం ప్రకాష్ ఆధ్వర్యంలో పార్టీ నాయకులు మంగళవారం మద్నూర్ మార్కెట్ కమిటీ కార్యాలయంలో శాలువతో ఘనంగా సత్కరించారు. ఈ సందర్భంగా ఆ గ్రామ అధ్యక్షులు మాట్లాడుతూ.. సాయిలు పార్టీ బలోపేతానికి ఎంతో కృషి చేస్తున్నారని, ఆయన సేవలను గుర్తించి పార్టీ హై కమాండ్ రెండోసారి మండల అధ్యక్షునిగా ఎన్నుకోవడం అభినందనీయమని పేర్కొన్నారు. ఈ సన్మాన కార్యక్రమంలో ఆ గ్రామ ఉప సర్పంచ్ శివాజీ యాదవ్ పాల్గొన్నారు.
కాంగ్రెస్ బలోపేతానికి మీ సేవలు అమూల్యం
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES



