నవ తెలంగాణ-మద్దూరు
క్రీడల్లో మద్దూరు యువత రాణించి మంచి పేరు తీసుకురా వాలని సర్పంచ్ కంఠరెడ్డి జనార్దన్ రెడ్డి అన్నారు. మద్దూరు మండల కేం ద్రంలో సంక్రాంతి పండుగ సందర్భం గా రామాలయ యూత్ ఆధ్వర్యంలో క్రికెట్ క్రీడోత్సవాలు నిర్వహించారు. క్రీడల్లో గెలుపొందిన క్రీడాకారులకు శనివారం బహుమతులు అందజేశారు. దాత హ్యాండ్ బాల్ అసోసియేషన్ ఛైర్మెన్ ఖాజా ఆరిఫ్ మొదటి బహుమతి ఇందాధ్ టీంకు రూ.4 వేలు, రెండవ బాహుమతి ఉమిరు టీంకు రూ.3 వేలు అందజేవారు. సర్పంచ్ జనార్ధన్ రెడ్డి, జగదీశ్వర్ గుప్తా ఆర్థిక సాయం అందించారు. కార్య క్రమంలో బీఆర్‌ఎస్ పార్టీ మద్దూరు గ్రామ శాఖ అధ్యక్షుడు, దామెర. మల్లేశం, హ్యాండ్ బాల్ కమిటి అధ్యక్షులు మనోహర్, మాజీ ఎంపీటీసీ. బూరుగు నర్సింలు గౌడ్, మాజీ ఎస్‌ఎంసి ఛైర్మెన్ రాచకొండ సాయిలు, నాయకులు , నీల బాలకష్ణ,బూరుగు రాజు, అబ్బు షరీఫ్, పార్షి,రామాలయ కమిటి సభ్యులు సతీష్, ప్రవీణ్, ఆల్ద. శ్రీకాంత్, శ్రవణ్, ప్రశాంత్, కార్తిక్, శేఖర్,.బీఎస్‌ఎఫ్ జవాన్ పోల్సాని. రవి, తదితరులు పాల్గొన్నారు