Thursday, April 23, 2026
E-PAPER
Homeరాష్ట్రీయంమే 18 నుంచి 23 వరకు యువజన క్రీడోత్సవాలు

మే 18 నుంచి 23 వరకు యువజన క్రీడోత్సవాలు

- Advertisement -

మంత్రులు శ్రీధర్‌బాబు, వాకిటి శ్రీహరి
నవతెలంగాణబ్యూరో-హైదరాబాద్‌

రాష్ట్ర వ్యాప్తంగా మే 18 నుంచి 23 వరకు యువజన క్రీడోత్సవాలను నిర్వహించాలని మంత్రులు దుద్దిళ్ల శ్రీధర్‌బాబు, వాకిటి శ్రీహరి అధికారులను ఆదేశించారు. బుధవారం హైదరాబాద్‌లోని మినిస్టర్స్‌ క్వార్టర్స్‌లో అందుకు సంబంధించిన పోస్టర్‌ను ఆవిష్కరించారు. అనంతరం క్రీడల షెడ్యూల్‌ ప్రకటించారు.
మే 1 నుంచి 12 వరకు జిల్లా కేంద్రాల్లో ఉద్యోగ మేళాలు
మే 18 నుంచి 23 వరకు యువజన కేంద్రీకృత కార్యక్రమాలు
మే 18 రాష్ట్రవ్యాప్తంగా మరథాన్‌ రన్‌ మరియు ఫిజికల్‌ లిటరసీ కార్యక్రమాలు
మే 19 కెరీర్‌ అండ్‌ స్కిల్‌ డెవలప్‌మెంట్‌ డే
మే 20 యూత్‌ లీడర్‌షిప్‌ సమ్మిట్స్‌
మే 21 క్రీడా దినోత్సవం
మే 22 ”యూత్‌ ఫర్‌ క్లీన్‌ తెలంగాణ, సర్వ్‌ అండ్‌ సపోర్ట్‌ కార్యక్రమం
మే 23 ఉద్యోగ సాధన కార్యక్రమాలను నిర్వహించాలని కోరారు. రాష్ట్ర వ్యాప్తంగా యువజనులు, క్రీడాకారులు పెద్ద ఎత్తున పాల్గొనేలా చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. ఈ కార్యక్రమంలో స్పోర్ట్స్‌ అథారిటీ మేనేజింగ్‌ డైరెక్టర్‌ డాక్టర్‌ ఏ. సోనిబాలాదేవి, పరిశ్రమల శాఖ డైరెక్టర్‌ నిఖిల్‌ చక్రవర్తి, యువజన సర్వీసులు జాయింట్‌ డైరెక్టర్‌ వేణుగోపాల్‌, స్పోర్ట్స్‌ అథారిటీ డిప్యూటీ డైరెక్టర్‌ డాక్టర్‌ రవితేజ, టాస్క్‌ సీఈవో నితిన్‌రెడ్డి, డీఐడీ అధికారి రాజేశ్వర్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -