భౌతిక కాయానికి పూలమాలవేసి నివాళులు అర్పించిన జడ్పీ చైర్మన్

నవతెలంగాణ -తాడ్వాయి : ములుగు జిల్లా తాడ్వాయి మండల కేంద్రానికి చెందిన ఉప సర్పంచ్ ఆలేటి ఇంద్రసేనారెడ్డి గారి తల్లి ఆలేటి మణెమ్మ సోమవారం మృతి చెందారు. ఈ విషయం తెలుసుకున్న ములుగు జిల్లా జడ్పీ చైర్మన్ బడే నాగజ్యోతి బిఆర్ఎస్ పార్టీ శ్రేణులతో కలిసి వచ్చి,  భౌతిక కాయాన్నికి పూలమాలవేసి నివాళులు అర్పించారు. ఉపసర్పంచ్ ఇంద్రసేనారెడ్డి వారి కుటుంబానికి ప్రగాఢ సానుభూతి తెలిపారు. ఈ కార్యక్రమంలో మాజీ జెడ్పిటిసి, జిల్లా నాయకులు రామ సహాయం శ్రీనివాస్ రెడ్డి, తాడ్వాయి మండల పార్టీ అధ్యక్షుడు దండుగుల మల్లయ్య, ఇందిరారపు లాలయ్య, పత్తి గోపాల్ రెడ్డి, బండారి చంద్రయ్య, రజనీకర్ రెడ్డి,  గ్రామ కమిటీ అధ్యక్షుడు బంగారు సాంబయ్య, తదితరులు పాల్గొన్నారు.
Spread the love