మిజోరంలో 26 స్థానాల్లో జడ్‌పీఎం విన్‌

నవతెలంగాఫ – ఐజ్వాల్‌: మరో రాష్ట్రంలో విపక్షానికే  ప్రజలు పట్టం కట్టారు. ఆదివారం ఫలితాలు వెలువడిన నాలుగు రాష్ట్రాల్లో మూడు చోట్ల ప్రతిపక్షాలే విజయం సాధించాయి. రాజస్థాన్‌, ఛత్తీస్‌గఢ్‌లో అధికారంలో కాంగ్రెస్‌ను ప్రజలు తిరస్కరించి బీజేపీకి పట్టం కట్టారు. తెలంగాణలో ఇన్నాళ్లు విపక్షంగా ఉన్న కాంగ్రెస్‌ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయనుంది. ఇక మధ్యప్రదేశ్‌లో తిరిగి బీజేపీకే అక్కడి ప్రజలు తిరుగులేని మెజార్టీ కట్టబెట్టారు. దీంతో ఎన్నికలు జరిగిన ఐదు రాష్ట్రాల్లో మిగిలింది మిజోరం.. అక్కడ కూడా ప్రతిపక్షానికే ఓటర్లు పట్టంకట్టారు. సీఎం జొరాంతంగా నేతృత్వంలోని మిజో నేషనల్‌ ఫ్రంట్‌ పరాజయాన్ని మూటగట్టుకున్నది. ఇప్పటివరకు వెలువడిన ఫలితాల్లో ఆ పార్టీ రెండు చోట్ల విజయం సాధించి మరో 9 స్థానాల్లో ఆధిక్యంలో ఉన్నది. ఇక ప్రతిపక్ష జోరం పీపుల్స్‌ మూవ్‌మెంట్‌ (ZPM) పార్టీ మెజార్టీ మార్కును దాటేసింది. ప్రభుత్వ ఏర్పాటుకు అవసరమైన 21 స్థానాలకు అధనంగా మరో ఐదో చోట్ల విజయం సాధిస్తున్నది. ఇప్పటివరకు 21 చోట్ల గెలుపొందగా, మరో స్థానాల్లో ముందంజలో ఉన్నది. దీంతో పార్టీ 26 మంది ఎమ్మెల్యేలతో ప్రభుత్వాన్ని ఏర్పాటుచేయనుంది. ఇక జాతీయ పార్టీలైన బీజేపీ రెండు స్థానాలకే పరిమితమవగా, కాంగ్రెస్‌ ఒక్క స్థానంతో సరిపెట్టుకున్నది.

Spread the love