నవతెలంగాణ-కాప్రా
ఆడపిల్లల భద్రత, సంరక్షణ, ఎదుగుదలకు అభయ అసోసియేషన్ ఫర్ ఎంపవర్‌మెంట్ ఆఫ్ ఉమెన్ ఎన్జీవో వారు ఆదివారం 70 మంది మహిళలతో కూడి ఈసీఐఎల్ క్రాస్ రోడ్స్ నుంచి ఓల్డ్ కాప్రా మున్సిపాల్టీ వరకు 2 కిలోమీ టర్‌లు వాక్ నిర్వహించారు. కుషాయిగూడ పోలీసులు సహాయ సహకారాలతో విజయవంతంగా ర్యాలీని పూర్తి చేశారు. మహిళలు, ఆడపిల్లలపై జరిగే లైంగికదాడులు, దాడులను అరికట్టించడానికి ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకొని రక్షణ కల్పించాలని అభయ అసోసియేషన్ టీం కోరారు. బేటి బచావో బేటి పడావో, సేవ్ గర్ల్ చైల్డ్ అన్న నినాదాలతో ర్యాలీ ముగించారు. ఉమెన్ ఎంపవర్మెంట్ అండ్ చైల్డ్ డెవలప్మెంట్ గురించి తమ టీం ఇంకా ఎంతో కషిచేసి ఎల్లప్పుడూ మహిళలకు అండగా నిలుచుంటుందని అభయ అసోసియేషన్ అధ్యక్షరాలు ధీరం ఉష తెలిపారు. అభయ ఎక్సిక్యూటివ్ బోర్డ్ మెంబర్‌లు గౌరీ, శేషు అనిత ఉమా మీనా ఉష, షకీలా, పద్మావతి మమత నివేదిత తదితరులు పాల్గొన్నారు.