–ఐటీ శాఖ ప్రిన్సిపల్ సెక్రెటరీ జయేష్ రంజన్
నవతెలంగాణ-బంజారాహిల్స్
భయంకరమైన క్యాన్సర్ వ్యాధి పట్ల అవగాహన కల్పించేందుకు వాక్ నిర్వహించడం అభినందనీయమని ఐటీ శాఖ ప్రిన్సిపల్ సెక్రెటరీ జయేష్ రంజన్ అన్నారు. ప్రపంచ క్యాన్సర్ దినోత్సవాన్ని పురస్కరించుకొని కేర్ ఆస్పత్రి ఆధ్వర్యంలో ఆదివారం బంజారా హిల్స్ రోడ్ నెంబర్ 2 కేబీఆర్ పార్క్ నుంచి రోడ్ నెంబర్ 10 కేర్ ఆస్పత్రి అవుట్ పేషంట్ వరకు వాక్‌ను నిర్వహించగా వైద్యులతో కలిసి ఆయన జెండా ఊపి ప్రారంభించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ… క్యాన్సర్ వ్యాధి రాకుండా తీసుకో వాల్సిన జాగ్రత్తలు, ప్రారంభ దశలోనే క్యాన్సర్‌ను గుర్తిం చడం ఎలా, వ్యాధి బారిన పడిన తర్వాత అందుబాటులో ఉన్న వైద్యం తదితర అంశాలను నగర ప్రజలకు తెలియ జేసేందుకు వారం రోజులపాటు ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహించడం సంతోషకరమన్నారు. అవగాహన వారోత్స వాల్లో భాగంగా మహిళలకు బ్రెస్ట్, సర్వైకల్ క్యాన్సర్ స్క్రీనింగ్ పరీక్షలను ఉచితంగా అందిస్తున్నట్టు వైద్యులు తెలిపారు. కేర్ ఆస్పత్రి క్యాన్సర్ అవేర్‌నెస్ కార్యక్రమానికి మద్దతుగా విచ్చేసిన జయేశ్ రంజాన్ చేతుల మీదుగా ప్యాకే జీ లోగోను ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో వైద్యులు, సర్జికల్ ఆంకాలజీ నిపుణులు, విపుల్ గోయాల్, మెడికల్ ఆంకాలజీ నిపుణులు సాయినాథ్, హెచ్‌సీఓ, నిలేష్, బ్లడ్ క్యాన్సర్ వైద్య నిపుణులు నరేష్ తదితరులు పాల్గొన్నారు.