వైభవంగా నాగార్జున మాంటిస్సోరి ఐఐటి ఒలంపియాడ్‌ వార్షికోత్సవం

నవతెలంగాణ -వనస్థలిపురం
వనస్థలిపురం డివిజన్‌ పరిధిలోని నాగార్జున మాంటి స్సోరి ఐఐటి ఒలంపియాడ్‌ స్కూల్‌ 32వ వార్షికోత్సవం ఛత్రపతి శివాజీ ఆట స్థలంలో అంగరంగ వైభవంగా ముగిసింది. గత ఏడాది పదవ తరగతి పరీక్షల్లో జీపీఏ 10 పాయింట్లు సాధించిన 29 మంది విద్యార్థులకు 5000 రూపాయలు బహుమతితో పాటు మెమొంటో ప్రదానం చేశారు. ఈ వార్షికోత్సవానికి ముఖ్యఅతిథిగా విచ్చేసిన నాగార్జున విద్యాసంస్థల చెర్మెన్‌ గుమ్మకొండ విఠల్‌రెడ్డి మాట్లాడుతూ విద్యా బోధనలో నాణ్యత ప్రమాణాలకు తమ విద్యాసంస్థల్లో అధిక ప్రాధాన్యత ఇస్తున్నామని తెలిపారు. నూతన సీసీిఈ పద్ధతిలో విద్యాబోధన చేస్తున్నందుకు ప్రతి ఏడాది తమ పాఠశాలకు చెందిన పలువురు విద్యార్థులు జాతీయస్థాయి పోటీ పరీక్షల్లో నెగ్గ్గి ఐఐటి, మెడిసిన్‌ సీటును సాధించినట్లు ఆయన తెలియజేశారు. విద్యతో పాటు విద్యార్థులకు వ్యక్తిత్వ వికాసం, భావ వ్యక్తీకరణ పెంపొందించడానికి తమ విద్యాసంస్థల్లో పలు కార్యక్ర మాలు చేపట్టినట్లు విఠల్‌రెడ్డి తెలియజేశారు. తగినంత సమయం కేటాయించాలని ఆయన కోరారు. చిన్నారులకు మొబైల్‌ ఫోన్లు వంటి పరికరాలకు దూరంగా ఉంచాలని ఆయన సూచించారు. నాగార్జున విద్యాసంస్థల వైస్‌ చైర్‌పర్సన్‌ జి.రజిని విఠల్‌రెడ్డి, సీఏఓఏ శేషారావు, అకాడమిక్‌ డిన్‌ ఎస్‌.రాజశేఖర్‌, పాఠశాల వైస్‌ ప్రిన్సిపాల్‌ ఎ.లక్ష్మీ తదితరులు పాల్గొన్నారు.

Spread the love