అభివృద్ధి పథంలో రాష్ట్రం నెంబర్‌ వన్‌

నవతెలంగాణ-కాప్రా
అభివృద్ధి పథంలో రాష్ట్రం ముఖ్యమంత్రి కేసీఆర్‌ నాయకత్వంలో దేశం లోనే నెంబర్‌వన్‌ రాష్ట్రంగా ఉందని ఉప్పల్‌ ఎమ్మెల్యే బేతి సుభాష్‌ రెడ్డి అన్నారు. మీర్‌పేట్‌ హెచ్‌బీ కాలనీ డివిజన్‌ పరిధిలోని మంగాపురం, కృష్ణానగర్‌ తదితర కాలనీలలో సుమారు రూ. 50 లక్షల అంచనా వ్యయంతో నూతన పైప్‌ లైన్‌ కోసం ఎమ్మెల్యే భేతి సుభాష్‌ రెడ్డి, స్ధానిక కార్పొరేటర్‌ జెరిపోతుల ప్రభుదాస్‌, మాజీ కార్పొరేటర్‌ గుండారపు శ్రీనివాస్‌ రెడ్డిలు బుధవారం శంకు స్థాపన చేశారు. అనంతరం ఎమ్మెల్యే మాట్లాడుతూ హెచ్‌ బీ కాలనీ డివిజన్‌ పరిధిలోని కాలనీలకి సంబంధించి ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు చేసుకున్నామని చెప్పారు. ఇక ముందు కూడా అభివృద్ధికి అవసరమైన సహకారం అందిస్తూ ఎల్లవేళలా అందుబాటులో ఉంటానని తెలిపారు.. వాటర్‌ వర్క్స్‌ జీఎం పి. సంతోష్‌ కుమార్‌, డీజీఎం సతీష్‌, ఏఈ వేణుగోపాల్‌, మంగాపురం, కష్ణానగర్‌ కాలనీల సం క్షేమ సంఘ నాయకులు, బీఆర్‌ఎస్‌ శేణులు పాల్గొన్నారు.
కాప్రా డివిజన్‌లోని ఎన్నారై కాలనీలో రూ. 41.90 లక్షల వ్యయంతో కాంపౌండ్‌ వాల్‌ ప్లే ఎక్విప్మెంట్స్‌ ఏర్పా టుకు, వాకింగ్‌ ట్రాక్‌ పనులకు, శ్రీరామ్‌ నగర్‌ కాలనీలో రూ.20.80 లక్షలతో సీసీ రోడ్డు పనుల నిర్మాణం, బాలాజీ ఎంక్లేవ్‌లో రూ. 8.70 లక్షలతో కమ్యూనిటీ హాల్‌ మిగిలి ఉన్న పనులకు ఎమ్మెల్యే బేతి సుభాష్‌రెడ్డి శంకుస్థాపన చేశారు. ఈ కార్యక్రమంలో కాప్రా కార్పొరేటర్‌ స్వర్ణ రాజు, మాజీ కార్పొరేటర్‌ కొత్త రామారావు, కుషాయిగూడ సర్కిల్‌ ఇన్‌స్పెక్టర్‌ వెంకటేశ్వర్లు, ఇన్‌స్పెక్టర్లు మహమ్మద్‌ షఫీ, వేణుమాధవ్‌, కాప్రా మున్సిపల్‌ సర్కిల్‌ అసిస్టెంట్‌ ఇంజనీర్‌ అభిషేక్‌, బీఆర్‌ఎస్‌ , కాప్రా డివిజన్‌ అధ్యక్షుడు సుడుగు మహేందర్‌ రెడ్డి, ప్రధాన కార్యదర్శి గిల్బర్ట్‌, ఉప్పల్‌ మైనార్టీ సెల్‌ ప్రెసిడెంట్‌ ఎంకే బద్రుద్దీన్‌, నాయకులు కాసం మహిపాల్‌ రెడ్డి, బాబురావు తదితరులు పాల్గొన్నారు.
మీర్‌పేట్‌ హెచ్‌.బీ కాలనీ డివిజన్‌ వార్డు కార్యాల యంలో కుషాయిగూడ వి.ఎన్‌. రెడ్డి నగర్‌ కాలనీ రెసిడెన్స్‌ వెల్ఫేర్‌ అసోసియేషన్‌లో నూతనంగా ఎన్నికైన కమిటీ సభ్యులను బుధవారం ఉప్పల్‌ ఎమ్మెల్యే బేతి సుభాష్‌ రెడ్డి శాలువాలతో సత్కరించి అభినందించి, తన సహాయ సహకారాలు కాలనీ అభివృద్ధికి ఎల్లవేళలా ఉంటాయని తెలిపారు. అదేవిధంగా కుషాయిగూడ వి.ఎన్‌. రెడ్డి నగర్‌ కాలనీ రెసిడెన్స్‌ వెల్ఫేర్‌ అసోసియేషన్‌ నూతన సంవత్సర క్యాలెండర్‌ను ఎమ్మెల్యే ఆవిష్కరించారు. కార్యక్రమంలో మీర్‌పేట ఎస్‌.వి కాలనీ కార్పొరేటర్‌ జేరిపోతుల ప్రభుదాస్‌, మాజీ కార్పొరేటర్‌ గుండారపు శ్రీనివాస్‌ రెడ్డి, కుషాయిగూడ వి.ఎన్‌. రెడ్డి నగర్‌ కాలనీ రెసిడెన్స్‌ వెల్ఫేర్‌ అసోసియేషన్‌ అధ్యక్షుడు సప్పిడి శ్రీనివాస్‌ రెడ్డి, ఉపాధ్యక్షుడు వాసుదేవా రెడ్డి, ప్రధాన కార్యదర్శి లక్ష్మీనారాయణ, ఆర్గనైజింగ్‌ సెక్రటరీ బుచ్చిరెడ్డి, బాల్రెడ్డి, రామ్‌ రెడ్డి రామచంద్రారెడ్డి, జాయింట్‌ సెక్రెటరీ సూర్య భగవాన్‌, తదితరులు పాల్గొన్నారు.

Spread the love