ఈ నెల 9న చలో హైదరాబాద్

నవతెలంగాణ-కంటేశ్వర్
కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ప్రజలను విస్మరించి పెట్టుబడిదారులకు, కార్పొరేట్ సంస్థలకు బడ్జెట్ను ప్రవేశపెట్టినట్టుగా ఉన్నది. అందుకని ప్రస్తుత బడ్జెట్లో మార్పులు చేసి ప్రజలకు ఉపయోగకరమైన బడ్జెట్ని తేవాలని, తెలంగాణ వ్యవసాయ కార్మిక సంఘం నిజాంబాద్ జిల్లా కమిటీ డిమాండ్ చేస్తున్నది. ఈ మేరకు జిల్లా కార్యాలయంలో జరిగిన పత్రిక విలేకరుల సమావేశంలో సంఘం జిల్లా అధ్యక్ష-కార్యదర్శులు ఏశాల గంగాధర్ – పెద్ది వెంకట్రాములు, జిల్లా ఉపాధ్యక్షులు నర్రా శంకర్, సహకార దర్శి గుండ్ల లక్ష్మణ్, జిల్లా కమిటీ సభ్యులు గోళం లక్ష్మి, కదం రాజు లు పాల్గొన్నారు.
ఉపాధి హామీ రంగానికి 2 లక్షల 40 వేల కోట్ల కేటాయించాలని, అలాగే రాష్ట్ర ప్రభుత్వం పెట్టన బడ్జెట్లో వ్యవసాయ కూలీలని పూర్తిగా మర్చిపోయారని అన్నారు. వ్యవసాయ ఉత్పత్తులు బాగా పెరిగినయని గొప్పలు చెప్పుకుంటున్న కేసీఆర్.. ఆ ఉత్పత్తిలో ప్రధాన పాత్ర పోషిస్తున్న వ్యవసాయ కూలీలని మర్చిపోయారు అని గుర్తు చేశారు. అందుకోసం వ్యవసాయ కూలీల సంక్షేమం కోసం, వారి నివాస స్థలాల కోసం, స్థలం ఉండి ఇల్లు కట్టుకోలేని వాళ్లకు 5.1/2 లక్షలు ఇంటి ఉచిత రుణం కోసం, ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకున్న డబుల్ బెడ్ రూమ్ ఇల్లని అర్హులైన వారికి పంచడం కోసం, కార్మికుల చట్టాలని మార్చి తెచ్చిన 4 కోడ్లని ఎత్తివేసి కార్మిక చట్టాలని పునరుద్ధరించడం కోసం, రైతాంగ సమస్యలను పరిష్కారం చేయడం కోసం ఈ ధర్నా జరుగుతున్నది. జిల్లా ప్రజలందరూ జయప్రదం చేస్తే ఈ ధర్నాన్ని జయప్రదం చేయాలని వ్యవసాయ కార్మిక సంఘం పిలుపునిస్తున్నది. అందుకు అధిక సంఖ్యలో పాల్గొనాలని జిల్లా ప్రజలను కోరుతున్నది.

Spread the love