కేసీఆర్‌ గొప్ప దార్శనికుడు

–  మంత్రి నిరంజన్‌రెడ్డి
నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్‌
కేసీఆర్‌ గొప్ప దార్శినికుడని వ్యవసాయ శాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్‌ రెడ్డి తెలిపారు. ప్రత్యేక తెలంగాణ రాష్ట్ర సాధన కోసం ఆయన 14 ఏండ్లపాటు ఉద్యమం నడిపారని గుర్తుచేశారు. కేసీఆర్‌ తొమ్మిదేండ్ల్ల తన పాలనతో రాష్ట్రాన్ని దేశానికి ఆదర్శంగా నిలిపారని పేర్కొన్నారు. విద్య, వైద్యం, విద్యుత్‌, ఉపాధి, వ్యవసాయ రంగాల్లో అనతికాలంలోనే ఊహించని చారిత్రక మార్పులను తెలంగాణ సాధించిందని తెలిపారు.
నేడు పీవీ మార్గ్‌లో వేడుకలు..
సీఎం కేసీఆర్‌ పుట్టినరోజు వేడుకలను శుక్రవారం మంత్రి తలసాని శ్రీనివాస్‌ యాదవ్‌ ఆధ్వర్యంలో పీవీ మార్గ్‌ లోని సంజీవయ్య పార్కులో నిర్వహించనున్నారు. ఈ వేడుకలకు శాసన మండలి చైర్మెన్‌ గుత్తా సుఖేందర్‌ రెడ్డి, డిప్యూటీ చైర్మెన్‌ బండ ప్రకాష్‌, శాసనసభ స్పీకర్‌ పోచారం శ్రీనివాసరెడ్డి, డిప్యూటీ స్పీకర్‌ పద్మారావు గౌడ్‌, మంత్రులు మహమూద్‌ అలీ, మల్లారెడ్డి, ఇతర మంత్రుల లతో పాటు ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీ లు, వివిధ కార్పొరేషన్‌ చైర్మెన్‌లు పాల్గొంటాని తెలిపారు.ఈ సందర్బంగా సాంస్కృతిక కార్యక్రమాలు, ప్రభుత్వ పథకాలపై ప్రత్యేక ప్రదర్శనలు నిర్వహించనున్నట్టు మంత్రి తలసాని ఒక ప్రకటనలో తెలిపారు.
కేసీఆర్‌ జన్మదినం సందర్భంగా కోలేటి పౌండేషన్‌ చీరల పంపిణీ..
సీఎం కేసీఆర్‌ జన్మదినాన్ని పురస్కరించుకుని తెలంగాణ రాష్ట్ర పోలీసు గృహనిర్మాణ సంస్థ చైర్మెన్‌ కోలేటి దామోదర్‌ తన పౌండేషన్‌ ద్వారా చీరల పంపిణీ చేపట్టారు.

Spread the love