గ్రూప్‌-3కి 3.83 లక్షల దరఖాస్తులు : టీఎస్‌పీఎస్సీ వెల్లడి

నవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్‌
రాష్ట్రంలో గ్రూప్‌ -3 పోస్టులకు 3,83,537 దరఖాస్తులొచ్చాయి. ఈ మేరకు తెలంగాణ రాష్ట్ర పబ్లిక్‌ సర్వీస్‌ కమిషన్‌ (టీఎస్‌పీఎస్సీ) కార్యదర్శి అనితా రామచంద్రన్‌ బుధవారం ఒక ప్రకటన విడుదల చేశారు. వాటి సమర్పణకు ఈనెల 23వ తేదీ సాయంత్రం ఐదు గంటల వరకు అవకాశముందని తెలిపారు. 1,363 గ్రూప్‌-3 పోస్టుల భర్తీ కోసం టీఎస్‌పీఎస్సీ డిసెంబర్‌ 30న నోటిఫికేషన్‌ను జారీ చేసిన విషయం తెలిసిందే. ఇతర వివరాలకు  https://www.tspsc.gov.in  సంప్రదించాలని సూచించారు.

Spread the love