జేఎన్టీయూ నిబంధనలను ఉపసంహరించుకోవాలి : టీఎస్‌టీసీఈఏ

నవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్‌
మొబిలిటీ ఆఫ్‌ ఫ్యాకల్టీపై జేఎన్టీయూ హైదరాబాద్‌ అనుబంధ కాలేజీలకు సర్క్యులర్‌ జారీ చేసిందని టీఎస్‌టీసీఈఏ అధ్యక్షుడు అయినేని సంతోష్‌కుమార్‌ తెలిపారు. అధ్యాపకులు పదేపదే మారితే బ్లాక్‌లిస్టులో పెడతామంటూ ప్రకటించిన నిబంధనలను ఉపసంహ రించుకోవాలని మంగళవారం ఒక ప్రకటనలో డిమాండ్‌ చేశారు. ఈ నిబంధన అధ్యాపకులను భయభ్రాంతులకు గురిచేసేలా ఉందని విమర్శించారు. సర్వీసు నిబంధనలు కాలేజీలు రూపొందించి అధ్యాపకులకు ఇవ్వాలని చెప్పడం సరైంది కాదని తెలిపారు. విశ్వవిద్యాలయమే ఆ నిబంధనలు రూపొందించి అన్ని కాలేజీలూ పాటించేలా చర్యలు తీసుకోవాలని డిమాండ్‌ చేశారు. ఉద్యోగుల నెలవారీ జీతాల చెల్లింపుపై దృష్టిసారించాలని కోరారు. ఇంజినీరింగ్‌, వృత్తి విద్యా కాలేజీల్లో పనిచేస్తున్న ఉద్యోగులు, అధ్యాపకులు, సిబ్బంది సమస్యల పరిష్కారం కోసం గ్రీవెన్స్‌ సెల్‌ను ఏర్పాటు చేయాలనీ, వారికి న్యాయం చేయాలని కోరారు.

Spread the love