నర్సింహారెడ్డి ఇంజినీరింగ్‌ కళాశాలలో ఘనంగా హ్యాక థాన్‌

నవతెలంగాణ-దుండిగల్‌
మైసమ్మగూడలోని నర్సింహరెడ్డి ఇంజినీరింగ్‌ కళాశాలలో శనివారం ఘనంగా జాతీయస్థాయి హ్యాకథాన్‌ నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా ఐఏఆర్‌ఈ ప్రొ.డా.పి.గోవర్ధన్‌ విచ్చేసి జ్యోతి ప్రజ్వలన చేసి సాంకేతికత ఆవశ్యకతను, కోడింగ్‌ ప్రాముఖ్యతను గురించి విద్యార్థులకు అర్థమయ్యే రీతిగా తెలియజేశారు. నేటి సమాజంలో మనుగడ సాధించాలంటే సాంకేతికతను ఎప్పటికప్పుడు పెంపొందించుకోవాలన్నారు. హ్యాక థాన్‌లో భాగంగా వెబ్‌ డెవలప్మెంట్‌ కోడింగ్‌, గేమింగ్‌ ఆప్స్‌ ఐఓటి పై కళాశాలలో జాతీయస్థాయిలో పలు పోటీలు నిర్వహిం చగా పలు కళాశాలల నుండి అనేకమంది విద్యార్థులు పాల్గొన్నారు. అనంతరం కళాశాల యాజమాన్యం ముఖ్య అతిధిని పుష్పగుచ్ఛం అందించి శాలువాతో సన్మానించారు ఈ కార్యక్రమంలో కళాశాల చైర్మెన్‌ జె.నర్సింహరెడ్డి, కార్యదర్శి జె.త్రిశూల్‌ రెడ్డి, కోశాధికారి జె.త్రిలోక్‌ రెడ్డి, కళాశాల ప్రిన్సిపల్‌ డా.లోకనాథం, కళాశాల సిబ్బంది విద్యార్థులు పాల్గొన్నారు.

Spread the love