– డిప్యూటీ మేయర్ ధనరాజ్ యాదవ్
నవతెలంగాణ-దుండిగల్
నిజాంపేట్ మున్సిపల్ కార్పొరేషన్‌లో చేపడుతున్న వివిధ పనులను త్వరగా పూర్తిచేయాలని డిప్యూటీ మేయర్ ధనరాజ్ యాదవ్ సూచించారు. గురువారం 14వ డివిజన్‌లో రూ.30లక్షలతో కమ్యూనిటీ హాల్, రూ. 20 లక్షలతో వెంకటరాయ నగర్ పార్క్ వాచ్‌మెన్ రూమ్, మరుగుదొడ్లు అభివద్ధి పనులను ప్రారంభించారు. కమ్యూనిటీ హాల్, వెంకటరాయ నగర్ పార్క్ పనులను నాణ్యతతో త్వరగా పూర్తి చేయాలని కాంట్రాక్టర్‌ను ఆదేశించారు. కార్యక్రమంలో మున్సిపల్ కమిషనర్ వంశీ కష్ణ, స్థానిక కార్పొరేటర్ రాజేశ్వరి వెంగయ్య చౌదరి, ఎన్‌ఎమ్‌సీ టీఆర్‌ఎస్ అధ్యక్షులు రంగరాయ ప్రసాద్, కార్పొరేటర్ రవి కిరణ్, సీనియర్ నాయకులు వెంగయ్య చౌదరి, ఆవుల జగన్ యాదవ్, ఏఈ ధీరజ్, డీఈ సుదర్శన్, 14వ డివిజన్ అధ్యక్షుడు బొబ్బా, కాలనీవాసులు కొర్ర శ్రీనివాస్, కిషోర్, దత్తు పాల్గొన్నారు.