పేదలు, రైతుల సంక్షేమం పట్టని బడ్జెట్‌ కేటాయింపులు

నవతెలంగాణ-ముషీరాబాద్‌
కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు 2023-24 ఆర్థిక సంవత్స రానికి గాను ప్రవేశపెట్టిన బడ్జెట్లలో దళితులు, ఆదివా సీలు, రైతుల సంక్షేమం పట్టని బడ్జెట్‌గా ఉన్నదని పీపుల్స్‌ మానిటరింగ్‌ కమిటీ జాతీయ కన్వీనర్‌ సత్యబాబు బోస్‌, రైతు స్వరాజ్య వేదిక నాయకులు కన్నెగంటి రవి, రైతు సంఘం రాష్ట్ర సహాయ కార్యదర్శి శోభన్‌ అన్నారు. శనివారం సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో పీపుల్స్‌ మానిట రింగ్‌ కమిటీ, తెలంగాణ అగ్రి నెట్వేర్క్‌, సీబీజీఏ సంయు క్తంగా పోస్ట్‌ బడ్జెట్‌ కన్సల్టెషన్‌ నిర్వహించారు. ఈ సంద ర్భంగా సన్న, చిన్నకారు రైతులు, కౌలు రైతులకు సంబం ధించి ప్రాధాన్యాలు కావాలన్నారు. వ్యవసాయ, వ్యవసాయ అనుబంధ రంగాలు, పరిశోధనలకు అలాగే డ్రిఫ్‌ ఇరిగే షన్‌, తదితర రంగాలకు కేటాయింపులు పెరగాలన్నారు. కుల వివక్ష పోరాట సంఘం రాష్ట్ర కార్యదర్శి టి.స్కైలాబ్‌ బాబు, డీబీఫ్‌ జాతీయ కార్యదర్శి పి.శంకర్‌ మాట్లాడుతూ దళిత, ఆదివాసులకు సంబంధించి గత బడ్జెట్‌ మాదిరి గానే ఇప్పుడు కేటాయించారు కానీ ఖర్చు చేయడంలో చిత్తశుద్ధి కనబడటం లేదన్నారు. గత బడ్జెట్‌లో దళితబం ధు అమలుకు రూ.1,7500 వేల కోట్లు కేటాయించి ఒక్కరూపాయి కూడా ఖర్చు చేయకుండా ఇప్పుడు కూడా రూ.17 వేల కోట్లు కేటాయించారన్నారు. గత బడ్జెట్‌లో రూ.33 వేలకోట్ల కు పైగా కేటాయించి డిసెంబర్‌ చివరి నాటికి కేవలం రూ.11వేలా 4 వందల కోట్లు మాత్రమే ఖర్చు చేశారన్నారు. కేటాయింపులను చూపి ప్రచార ఆర్బా Ûటాలు చేయకుండా ఖర్చు చేయాలన్నారు. మాంట్‌ ఫోర్ట్‌ సోషల్‌ ఇనిస్టిట్యూట్‌ డైరెక్టర్‌ బ్రదర్‌ వర్గీస్‌ మాట్లాడుతూ అసంఘటితరంగ కార్మికులు, డొమెస్టిక్‌ వర్కర్స్‌, ఉపాధి హామీ కూలీల సంకక్షేమం పట్ల బడ్జెట్‌ కేటాయింపులు లేవనీ, వీరి కోసం ప్రత్యేక నిధిని ఏర్పాటు చేయాలన్నారు. ఈ కార్యక్రమానికి పీపుల్స్‌ మానిటరింగ్‌ కమిటీ రాష్ట్ర కన్వీ నర్‌ సురుపంగ శివలింగం అధ్యక్షత వహించగా సీబీజీఏ ప్రతినిధి సోమశేఖర్‌, పి.శ్రీనివాసులు, కె.ఉమాదేవి, తెలం గాణ అగ్రి నేట్వేర్క్‌ ప్రతినిధులు కానుగంటి శ్రీశైలం, వై.మధుబాబు, రాంబాబు పాల్గొని ప్రసంగించారు.

Spread the love