పోచమ్మ తల్లి ఆలయ పునర్‌ ప్రతిష్ట విగ్రహాల శోభాయాత్ర

నవతెలంగాణ-కూకట్‌పల్లి
కూకట్‌పల్లి నల్ల చెరువు వద్ద ఉన్న అతి పురాతనమైన పోచమ్మ తల్లి ఆలయ పునర్‌ ప్రతిష్ట కార్యక్రమంలో భాగంగా సోమవారం అమ్మవారి శోభాయాత్ర చిత్తారమ్మ ఆలయం నుంచి ప్రారంభమైంది. ఈ కార్యక్రమానికి ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు హాజరై అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించి శోభాయాత్రలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ కూకట్‌పల్లి గ్రామం ఒకప్పుడు పచ్చని పంట పొలాలతో, పాడిపంటలతో కళకళలాడుతూ ఉండేదనీ, అతి పురాతనమైన కూకట్‌ పల్లి లోని అన్ని ఆలయాలను పునర్నిర్మించి భవిష్యత్‌ తరాలకు ఆధ్యాత్మిక శక్తిని అందించడమే లక్ష్యంగా, అందులో తాను కూడా భాగస్వామ్యం అయినందుకు సంతోషంగా ఉందని అన్నారు. 16వ తేదీన జరుగు పోచమ్మ తల్లి విగ్రహ ప్రతిష్ట కార్యక్రమం కూడా అత్యంత వైభవంగా నిర్వహి స్తున్నామని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఆలయ కమిటీ సభ్యులు, భక్తులు పాల్గొన్నారు.

Spread the love