నేడు యుఎస్‌ఏ, కెనడా, ఆస్ట్రేలియా, యూకే కన్సల్టేషన్‌ డే

నవతెలంగాణ-కేపీహెచ్‌బీ
యునైటెడ్‌ స్టేట్స్‌ ఆఫ్‌ అమెరికా, యూకే, కెనడా, ఆస్ట్రేలియా దేశాలలో ఉన్నత విద్యను అభ్యసించి స్థిరపడాలనుకునే విద్యార్థుల కోసం శనివారం యూని ఎక్స్‌ పర్ట్స్‌ ఆధ్వర్యంలో యూఎస్‌ఏ, యుకె కెనడా కన్సల్టేషన్‌ డేను నిర్వహిస్తున్నట్టు సంస్థ ప్రతినిధి బన్నూరు ఇంతియాజ్ తెలిపారు. ఈ మేరకు శుక్రవారం కూకట్‌ పల్లి లోని సంస్థ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. ఈ కన్సల్టేషన్‌ లో పాల్గొనే విద్యార్థులు ఎటువంటి ప్రాసెసింగ్‌ ఫీజు లేకుండా అన్ని కోర్సులకు ప్రాసెసింగ్‌ చేసుకోవడంతో పాటు వీసా ప్రాసెసింగ్‌ కూడా పొందవచ్చునని తెలిపారు. విదేశాలకు వెళ్లే విద్యార్థులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాల్సిందిగా కోరారు. పూర్తి వివరాల కోసం 99123 28645 నెంబర్‌ ను సంప్రదించాలని కోరారు.

Spread the love