మాణిక్‌రెడ్డి గెలవాలి

–  చుక్కా రామయ్య ఆకాంక్ష
నవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్‌
మూడున్నర దశాబ్దాలుగా ఉపాధ్యాయ ఉద్యమంలో కార్యకర్తగా పనిచేస్తూ, నిబద్ధతతో ఉపాధ్యాయులకు సేవ చేస్తున్న పాపన్నగారి మాణిక్‌ రెడ్డి ఎమ్మెల్సీగా గెలవాలని ప్రముఖ విద్యావేత్త చుక్కా రామయ్య ఆకాంక్షించారు. టీఎస్‌యూటీఎఫ్‌ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి చావ రవి, రాష్ట్ర కార్యదర్శి ఎ సింహాచలంతో కలిసి ఎమ్మెల్సీ అభ్యర్థి మాణిక్‌ రెడ్డి శనివారం హైదరాబాద్‌లో చుక్కా రామయ్యను కలిసి పరామర్శించారు. సోమవారం నామినేషన్‌ దాఖలు చేస్తున్న సందర్భంగా రామయ్య ఆశీస్సులు కోరారు. శాసన మండలి ఉద్యమ కారులకు వేదిక కావాలనీ, ప్రభుత్వ విద్యారంగం అభివృద్ధి, ఉపాధ్యాయుల సంక్షేమం కోసం అందులోని చర్చలు దోహద పడాలని ఈ సందర్భంగా రామయ్య ఆకాంక్షించారు. అందుకు సరైన వ్యక్తి మాణిక్‌రెడ్డి అని రామయ్య అభిప్రాయపడ్డారు. తన సంపూర్ణ మద్దతును ప్రకటించారు. ఉపాధ్యాయులు, అధ్యాపకులు తమ మొదటి ప్రాధాన్యతా ఓటును మాణిక్‌ రెడ్డికే వేయాలని ఆయన పిలుపునిచ్చారు.

Spread the love