నవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్
రాష్ట్రంలోని మోడల్ స్కూళ్లలో ఆరో తరగతితోపాటు ఏడు నుంచి పదో తరగతి వరకు ప్రవేశాలకు సంబంధించి ఖాళీ సీట్ల భర్తీ కోసం ఆన్‌లైన్‌లో దరఖాస్తు గడువును ఈనెల 22 వరకు ప్రభుత్వం పొడిగించింది. ఈ మేరకు మోడల్ స్కూళ్ల అదనపు సంచాలకులు ఉషారాణి మంగళవారం ఒక ప్రకటన విడుదల చేశారు. రాష్ట్రంలోని 194 మోడల్ స్కూళ్లలో ఆంగ్ల మాధ్యమంలో బోధన ఉంటుందని తెలిపారు. ఆరో తరగతిలో ఒక్కో పాఠశాలలో వంద సీట్లు అందుబాటులో ఉంటాయని వివరించారు. ఏడు నుంచి పదో తరగతి వరకు ఖాళీ సీట్లు భర్తీ చేస్తామని పేర్కొన్నారు. ఓసీలు రూ.200, ఎస్సీ,ఎస్టీ,బీసీ, వికలాంగులు, ఈడబ్ల్యూఎస్ విద్యార్థులు రూ.125 దరఖాస్తు ఫీజు చెల్లించాలని కోరారు. ఇతర వివరాల కోసం షషష.్‌రఎశీసవశ్రీరషష్ట్రశీశీశ్రీర.షశీఎ వెబ్‌సైట్‌ను సంప్రదించాలని సూచించారు. ఇప్పటి వరకు 43,498 దరఖాస్తులొచ్చాయని వివరించారు.