శ్రీచైతన్యపై చర్యలు తీసుకోవాలి : పీడీఎస్‌యూ

నవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్‌
ఇంటర్‌ విద్యార్థి రమాదేవి మరణానికి కారణమైన శ్రీచైతన్య యాజమాన్యంపై చర్యలు తీసుకోవాలని పీడీఎస్‌యూ రాష్ట్ర అధ్యక్షుడు పి రామకృష్ణ, ప్రధాన కార్యదర్శి ఎన్‌ ఆజాద్‌ రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్‌ చేశారు. ఆ విద్యార్థిని ఆత్మహత్యకు కారణమైన ఆ యాజమాన్యంపై క్రిమినల్‌ కేసు నమోదు చేయాలని మంగళవారం ఒక ప్రకటనలో తెలిపారు. అందుకు కారణమైన వారిని వెంటనే అరెస్టు చేయాలని కోరారు. అనుమతుల్లేని బ్రాంచీలను రద్దు చేసి సీజ్‌ చేయాలని డిమాండ్‌ చేశారు. లేనిపక్షంలో ఇంటర్‌ బోర్డు, శ్రీచైతన్య యాజమాన్యం మధ్య ఉన్న సంబంధం బట్టబయలు చేస్తూ ఉద్యమిస్తామని హెచ్చరించారు.

Spread the love