బ్రిక్స్‌ సదస్సుకు జిన్‌పింగ్‌, మోడీ

బీజింగ్‌ : దక్షిణాఫ్రికాలో జరగనున్న 15వ బ్రిక్స్‌ సదస్సుకు భారత ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ, చైనా అధ్యక్షుడు జిన్‌పింగ్‌ హాజరుకానున్నారు. దక్షిణాఫ్రికా అధ్యక్షుడు సిరిల్‌ రమఫోసా ఆహ్వానం మేరకు జోహెన్స్‌బర్గ్‌లో జరగనున్న 15వ బ్రిక్స్‌ శిఖరాగ్ర సమావేశానికి జిన్‌పింగ్‌ హాజరవుతారని చైనా విదేశాంగ మంత్రిత్వ శాఖ అధికార ప్రతినిధి హువా చున్యింగ్‌ శుక్రవారం ప్రకటించారు. ఈ నెల 21 నుంచి 24 వరకు దక్షిణాఫ్రికాలో పర్యటిస్తారని తెలిపారు. రష్యా అధ్యక్షుడు పుతిన్‌ వీడియో కాన్ఫరెన్స్‌ ద్వారా బ్రిక్స్‌ సదస్సులో పాల్గొననున్నారు. సదస్సుకు హాజరవుతున్న మోడీ, జిన్‌పింగ్‌ భేటీ అవుతారా అనే అంశంపై ఇప్పటివరకూ స్పష్టత లేదు.

Spread the love