ఉత్తర చైనాలో రెడ్‌ అలర్ట్‌

– తుపాను ధాటికి వణికిపోత్ను బీజింగ్‌, చుట్టుపక్కల ప్రాంతాలు
– ఇద్దరి మృతి, పలుచోట్ల ముంచెత్తిన వరదనీరు
బీజింగ్‌, చుట్టుపక్కల బ్రీజింగ్‌ : గత కొద్ది రోజులుగా దోక్సూరి తుపాను ప్రభావంతో బీజింగ్‌, దాని చుట్టుపక్కల ప్రాంతాలను వర్షాలు ముంచెత్తుతున్నాయి. పశ్చిమ బీజింగ్‌లోని మెంటొగు ప్రాంతంలో శనివారం నుండి అతి భారీ వర్షాలు కురిశాయి. శనివారం రాత్రి 8గంటల నుండి అర్ధరాత్రి ఒంటిగంట వరకు నగరంలో సగటు వర్షపాతం 176.9 మి.మీగా గా నమోదవగా మెంటొగు జిల్లాలో సగటున 322.1మి.మీ వర్షపాతం నమోదైందని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. దీంతో బీజింగ్‌లో వరద హెచ్చరికలు జారీ చేశారు. మెంటొగులో అత్యంత భారీ వర్షపాతం నమోదు కావడంతో అకస్మాత్తుగా వరదలు సంభవించాయి. పలు పల్లపు ప్రాంతాలు, శివారు ప్రాంతాలు నీట మునిగాయి. ఇద్దరు మరణించారు. వరద నీటి ప్రవాహానికి అనేక కార్లు కొట్టుకుపోయాయి. వంతెన పైనుండి వరద నీరు ప్రవహించడం కనిపిస్తోంది. పలు రెస్టారెంట్లు, సూపర్‌ మార్కెట్లలోకి నీరు వచ్చేసింది. పలుచోట్ల కొండచరియలు విరిగిపడ్డాయి. దీంతో దాదాపు 5వేల మందిని పర్వత ప్రాంతాల నుండి సురక్షిత ప్రాంతాలకు తరలించారు. ఇంకా మరికొంతమంది తమను అక్కడ నుండి తరలించడం కోసం ఎదురుచూస్తున్నారు. మొత్తంగా ఉత్తర చైనాలో రెడ్‌ అలర్డ్‌ ప్రకటించారు. భారీ వర్షపాతం కారణంగా ఎక్కడికక్కడ పెద్ద మొత్తంలో నీరు నిలిచిపోవడంతో పాటూ అనేక రహదారులు దెబ్బతిన్నాయి. తాజా పరిస్థితుల నేపథ్యంలో బీజింగ్‌తో సహా ఉత్తరచైనాలో రెడ్‌ అలర్డ్‌ ప్రకటించారు. మెంటొగు, ఫెంగ్‌తారు జిల్లాల్లో భవనాలు కూలిపడే అవకాశం వుందని, కొండ, మట్టి చరియలు విరిగిపడే ప్రమాదమందని అధికారులు హెచ్చరికలు జారీ చేశారు. మెంటొగుతో పాటూ బీజింగ్‌లోని ఇతర శివారు ప్రాంతాలు కూడా బాగా దెబ్బతిన్నాయి. ఫంగ్‌షాన్‌ జిల్లాలోని జౌకుడియన్‌ పట్టణంలో ఒక కంపెనీకి చెందిన 80మంది ఉద్యోగులు వరద నీటిలో చిక్కుకుపోయారు. వారిని రక్షించే చర్యలు కొనసాగుతున్నాయి.

Spread the love