‘చైనా నుంచి వేరుపడే వ్యూహం’ తమకు సమ్మతం కాదు: ఫ్రెంచ్‌ మంత్రి

They do not agree with the 'strategy of separation from China': French ministerభద్రతా కారణాల రీత్యా చైనా నుంచి ‘వేరుపడాల’అని తమకు అందుతున్న సూచనలను ఫ్రాన్స్‌ తిరస్కరిస్తుందని ఫ్రెంచ్‌ ఆర్థిక మంత్రి బ్రూనో లీ మైర్‌ ప్రకటించాడు. చైనా మార్కెట్‌ తమకు మరింతగా అందుబాటులో ఉండాలని, ఆ దేశంతో మరింత మెరుగైన వాణిజ్య సంబంధాలను ఫ్రాన్స్‌ కోరుతుందని ఆయన చెప్పాడు. ”మేము వేరుపడాలనే ఆలోచనను తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాము. వేరు పడటం ఒక భ్రమ” అని బీజింగ్‌ లో చైనా ఉప ప్రధాని హే లైఫెంగ్‌ తో చర్చలు జరిపాక ప్రకటించాడు.
ఫ్రాన్స్‌ అవగాహనలో అమెరికా, ఐరోపా, చైనా ఆర్థిక వ్యవస్థలను వేరు చేయటం సాధ్యపడదు. వీటన్నిటికీ చైనా మార్కెట్‌ కీలకంగా ఉంటుంది. అమెరికా చైనాపట్ల అత్యంత ప్రతికూలంగావున్న స్థితిలో చైనా, యూరోపియన్‌ యూనియన్‌ ల పరస్పర సహకారానికి ప్రాధాన్యత పెరిగింది. ఇండో-పసిఫిక్‌ ప్రాంతంలో చైనా ఆర్థిక బలత్కాలకు పాల్పడుతోందని అమెరికా, యూరోపియన్‌ యూనియన్‌ ఆరోపిస్తున్నాయి. చైనా వ్యతిరేక విధానాలను ముందుకు తేవటానికి అమెరికా వాణిజ్య నిబంధనలను ఆయుధీకరిస్తోందని చైనా ఆరోపిస్తోంది.
అయితే చైనాపైన ఆధారపడటాన్ని తగ్గించుకోవటానికి ఆర్థిక వ్యవస్థలను వేరుచేయటం నుంచి ప్రమాదాన్ని తగ్గించుకునే, వికేంద్రీకరించుకునే లక్ష్యంవైపు పశ్చిమ దేశాలు అడుగులు వేస్తున్నాయి. ఈ అవగాహన జపాన్‌ లో జరిగిన జి-7 దేశాల సంయుక్త ప్రకటనలో ప్రతిబింబించింది. ఈ సమావేశం ‘ప్రపంచ ఆర్థిక వ్యవస్థను చైనా విక్రుతీకరించింది’ అని ఆరోపించింది. పశ్చిమ దేశాలు ‘ప్రచ్చన్న యుద్ధ మనస్థత్వం’తో తనపైన బురద జల్లుతున్నాయని ఈ ఆరోపణలను తిరస్కరిస్తూ చైనా ప్రకటించింది.

Spread the love