నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్
ఓ మహిళను అక్రమంగా అరెస్టు చేసి, థర్డ్ డిగ్రీ ప్రయోగించి శారీరక హింసకు గురి చేసిన పోలీసులు పై కేసు నమోదు చేసి విచారణ చేపట్టాలని అఖిల భారత ప్రజాతంత్ర మహిళా సంఘం(ఐద్వా) రాష్ట్ర అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు ఆర్ అరుణ జ్యోతి, మల్లు లక్ష్మి శుక్రవారం ఒక ప్రకటనలో డిమాండ్ చేశారు. ఎల్‌బీ నగర్ పోలీసు స్టేషన్‌లో మహిళను అరెస్ట్ చేసి ఎటువంటి కేసు నమోదు చేయకుండా, రాత్రి మొత్తం స్టేషన్లో ఉంచటమేంటని ప్రశ్నించారు. ఇది చట్ట వ్యతిరేకమైందనీ, ఇందుకు బాధ్యులైన పోలీసులపై చర్య తీసుకోవాలని డిమాండ్ చేశారు. కానిస్టేబుల్‌ను సస్పెండ్ చేస్తూ నోటీసు ఇస్తే సరిపోదని పేర్కొన్నారు.